సినీజోష్ రివ్యూ: హీరో
బ్యానర్: అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: అశోక్ గళ్ళ, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
నిర్మాత: పద్మావతి గల్లా
డైరెక్టర్: శ్రీరామ్ ఆదిత్య
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, పొలిటికల్ లీడర్ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ తెరకి పరిచయమవుతున్నాడు అనగానే అందరిలో ఆసక్తి మొదలయ్యింది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి హీరో అంటే మాములు విషయం కాదు. గల్లా అశోక్, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో టైటిల్ తో అదిరిపోయే ప్రమోషన్స్ తో సినిమాని రెడీ చేసేసాడు. పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి పోస్ట్ పోన్ అవడంతో అశోక్ గల్లా హీరో సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మరి ఈ సంక్రాంతికి హీరో మూవీ తో గల్లా అశోక్ హిట్ కొట్టాడా.. లేదా అనే విషయం సమీక్షలో చూసేద్దాం.
కథ:
సినిమా హీరో అవ్వాలని కలలు కనే మిడిల్ క్లాస్ యువకుడు అర్జున్(అశోక్ గల్లా). ఆలా కలలు కనే అర్జున్ పక్కింటి అమ్మాయి సుబ్బు(నిధి అగర్వాల్) ప్రేమలో పడడమే కాదు.. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అదే టైం లో అర్జున్ కి ఓ కొరియర్ వస్తుంది. దానిలో ఓ గన్ ఉంటుంది. ఆ గన్ తో ఒకరిని చంపమని అర్జున్ కి మాఫియా నుండి కబురు వస్తుంది. జగపతి బాబు ను డాన్ గా ఎందుకు చూపించాడు. అసలు హీరో అవ్వాలన్న అర్జున్ కి ఆ మాఫియాకి సంబంధం ఏమిటి? సుబ్బు - అర్జున్ పెళ్లి చేసుకుంటారా? అసలు అర్జున్ చంపాల్సింది ఎవరిని? అనేది హీరో సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
పెరఫార్మెన్స్:
గల్లా అశోక్ చేసింది మొదటి సినిమానే అయినా డాన్స్ విషయంలో, అలాగే కొన్ని చోట్ల నటన విషయం చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. అంతేకాదు.. లుక్స్ వైజ్ గాను ఆకట్టుకున్నాడు. చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు. గ్లామర్ డాల్ నిధి అగర్వాల్ నటనకి స్కోప్ ఉన్న పాత్ర పడలేదు. జస్ట్ గ్లామర్ కి, సాంగ్స్ కోసమే అన్నట్టుగా ఉంది. కానీ ఉన్నంతలో అందంగా కనిపించింది. జగపతి బాబు కేరెక్టర్ ఆకట్టుకుంది. నరేష్ అలవాటైన పాత్ర లో అల్లుకుపోయాడు. వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ, సత్య కామెడీ పండించారు. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
సినీ నేపథ్యం ఫ్యామిలీ నుండి హీరో వస్తున్నాడనగానే.. ఏ మాస్ అంశాలతోనో, లేదంటే కమర్షియల్ హంగుల హడావిడినో ఉంటుంది. కానీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం కొత్త కథని తీసుకుని హీరోయిజం బయటపెట్టేలా హీరో కథని తీసుకున్నాడు. కామెడీ తో కూడిన కథని తీసుకుని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు. సినిమా బ్యాక్ డ్రాప్ లో కథని ఎంచుకుని ఫస్ట్ హాఫ్ ని కామెడిగాను, కొత్త స్క్రీన్ ప్లే తో, హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అన్ని ఆసక్తిగా అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. మాఫియా బ్యాక్డ్రాప్ కాస్త సిల్లీగా అనిపిస్తుంది. స్టోరీ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో కామెడీ జెనెరేట్ అవడం మాత్రం సినిమాకి కలిసొచ్చింది. అందుకే బోర్ కొట్టకుండా సినిమాని చివరివరకు లాగించేసారు.
సాంకేతికంగా:
మ్యూజిక్ పరంగా చెప్పుకునేంత గా ఏమి లేదు కానీ.. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలెట్ అయ్యింది. సాంగ్స్ చిత్రీకరణ, కొన్ని ఛేజింగ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్ లో మాత్రం కత్తెర వేయాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో లేపెయ్యల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
రేటింగ్: 2.75/5