సంక్రాంతి కి విడుదల అయిన అన్ని సినిమాలు అంత పెద్ద చెప్పుకోదగ్గవిగా లేవు. నాగార్జున సినిమాకి మొదటి నుండి నెగటివ్ టాక్. దానికి తోడు సినిమాలో విషయం లేదు. రౌడీ బాయ్స్ కూడా అంతంత మాత్రమే. అయితే గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో విడుదల అయిన బాలకృష్ణ నటించిన అఖండ సినిమానే ఇంకా బ్రహ్మాండంగా ఆడుతోంది. ఈ సంక్రాంతికి కూడా ఆ సినిమా ఉన్న థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ నడుస్తున్నాయి. అందువల్ల బాలకృష్ణ సినిమా సంక్రాంతి బరిలో లేకపోయినా కూడా అఖండ తో గట్టి పోటీ ఇస్తున్నాడు.
ఈ సంక్రాంతి హీరో బాలకృష్ణనే అని అంటున్నారు. ఇటు ఆంధ్ర అటు తెలంగాణాలో ఇంకా బాగా ఆడుతుంది బాలకృష్ణ సినిమా. నాగార్జున నటించ బంగార్రాజు రెండో రోజు కి కలెక్షన్స్ తగ్గటమే కాకుండా, బాగా బాడ్ టాక్ వచ్చేసింది. అఖండ సినిమానే కాకుండా, బాలకృష్ణ టాక్ షో ఇంకా చాలా బాగా దున్నేస్తుంది. ఈ సంక్రాంతికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా లో ఆడుతుంది. ఇవన్నీ కలిపి చూస్తే, బాలకృష్ణ సందడే ఎక్కువ సంక్రాంతికి. అందుకే బాలకృష్ణ . మరి దీనిని సంక్రాంతి హీరో.