నాగార్జున విడుదలకు ముందు తన సినిమా బంగార్రాజు గురించి.. చాలా ఎక్కువ మాట్లాడేసాడు. అప్పుడే అనుకున్నారు అందరూ ఈ సినిమా ఎదో తేడాగా ఉందని. అలానే అయ్యింది. సినిమాలో దమ్ము లేదు, విషయం లేదు. ఎదో పాత కాలపు కథని పట్టుకొని సినిమా అంతా నడిపించేసాడు నాగార్జున. బంగార్రాజు సినిమాలో ఒక్క జోక్ కూడా పేలలేదు. నాగార్జున ఇంకా మన్మధుడు సినిమా ఆలోచనలోనే వున్నాడు. దాని నుండి బయటకి రావాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే, ఈ బంగార్రాజు సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ని అలా ప్రాజెక్ట్ చేసారు.
నాగార్జున అనగానే చుట్టూ ఓ నాలుగురయిదుగురు హీరోయిన్స్ ఉండాలి అన్నట్టుగా పెట్టారు. ఈ ఏజ్ లో నాగార్జున కి అవసరమా ఇవన్నీ అన్నట్టుగా సినిమా చూస్తున్న ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పండగ కాబట్టి బంగార్రాజు బతికిపోయాడు, లేకపోతే దుమ్ము దులుపు కోవటానికి కూడా డబ్బులు రరావేమో అన్నట్టుగా ఉంది సినిమా. నాగ చైతన్య ని కొత్తగా చూపింఛా అన్నాడు కూడా, కానీ ఈ సినిమాలో చైతన్య కి కూడా విషయం లేదు. చాలామంది ఆర్టిస్ట్స్ ని నాగార్జున సరిగ్గా వినియోగించలేదు అన్నది టాక్.
ఏమైనా కూడా నాగార్జున చాలా తెలివిగా సినిమా విడుదలకి ముందే మంచి బిజినెస్ చేసేసాడు కాబట్టి సరిపోయింది. దర్శకుడు కళ్యాణ్ కాకుండా అంతా నాగార్జునే చేసారు అని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తో అయినా నాగార్జున కొంచెం మారి, కొత్త కథలను ఎంచుకుంటే బాగుంటుందని, ప్రేక్షకుల అభిప్రాయం.