Advertisementt

15 మిలియన్ ఫాలోయర్స్‌ తో బన్నీ రికార్డ్

Fri 14th Jan 2022 09:42 PM
allu arjun,pushpa-the roar,15 million followers,instagram  15 మిలియన్ ఫాలోయర్స్‌ తో బన్నీ రికార్డ్
Allu Arjun Clocks 15 Million Followers On Instagram 15 మిలియన్ ఫాలోయర్స్‌ తో బన్నీ రికార్డ్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నార ఏళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం.

2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు ఐకాన్ స్టార్. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా అల్లు అర్జున్‌ను సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈయన తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప: రి రైజ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

Allu Arjun Clocks 15 Million Followers On Instagram:

Allu Arjun is yet to resume the shoot of Pushpa-The Roar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ