బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంతోమంది ఫ్రెండ్స్ గా మారారు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఎనిమీస్ గా మారారు, ఇంకొందరి ఫ్రెండ్ షిప్ హౌస్ లోకి వెళ్లక ముందు కన్నా.. ఇంకాస్త ముదిరింది. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో ఫ్రెండ్స్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ - సిరిల ఫ్రెండ్ షిప్ ముదిరి పాకాన పడింది. దానితో బిగ్ బాస్ బయటకి వచ్చాక వాళ్ళ లవర్స్ వాళ్ళ ఇద్దరికి షాకివ్వగా.. సీజన్ 5 లోకి కాస్త తెలుసున్న వ్యక్తులుగా అడుగుపెట్టిన మానస్ - సన్నీ లు డీప్ దోస్తానాలుగా హౌస్ బయటికి వచ్చారు. కాజల్ కూడా వీరి తో ఫ్రెండ్ షిప్ చేసింది. అయితే బయట ఫ్రెండ్స్ అయిన కాజల్ - రవి లు మాత్రం శత్రువులుగా బయటికి వచ్చారు.
బిగ్ బాస్ లో మంచి ఫ్రెండ్స్ గా మారిన సన్నీ , మానస్ లు బయటికి వచ్చాక కలిసి ఇంటర్వూస్ ఇవ్వడం, అలాగే ఒకరి పై ఒకరి స్నేహాన్ని బయట పెట్టడం చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో సన్నీ - మానస్ లు మరోసారి తమ స్నేహాన్ని బుల్లితెర ప్రేక్షకులకి చూపించారు. మా సంక్రాంతి వేడుక స్పెషల్ ఈవెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే సీరియల్ నటులు పాల్గొనగగా.. అందులో సన్నీ - మానస్ ల ఫ్రెండ్ షిప్ హైలెట్ అయ్యింది.