Advertisementt

బంగార్రాజు ప్రీమియర్స్ టాక్

Fri 14th Jan 2022 09:10 AM
bangarraju,bangarraju overseas talk,nagarjuna,naga chaitanya,bangarraju premiers talk  బంగార్రాజు ప్రీమియర్స్ టాక్
Bangarraju Premiers show talk బంగార్రాజు ప్రీమియర్స్ టాక్
Advertisement
Ads by CJ

నాగార్జున - నాగ చైతన్య కలయికలో క్రేజీ మల్టీస్టారర్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనతో సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబో.. ఈసారి సంక్రాంతికి కలర్ ఫుల్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు. పొంగల్ స్పెషల్ గా రిలీజ్ అవుతున్న మూవీస్ లో నాగార్జున బంగార్రాజే క్రేజీ మూవీగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించేలా ప్రమోషన్స్ చేసారు మేకర్స్.

నేడు భోగి స్పెషల్ గా రిలీజ్ అయిన బంగార్రాజు మూవీ ప్రీమియర్స్ హడావిడి ఓవర్సీస్ లో గత అర్ధరాత్రే మొదలైపోయింది. ఓవర్సీస్ లో బంగార్రాజు మూవీ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందొ సోషల్ మీడియాలో రివ్యూ లు ఇచ్చేస్తున్నారు. బంగార్రాజు ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయంతో కాస్త ఏవరేజ్‌గా ఉంది అని, ఇంటర్వెల్‌ బాంగ్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుందని.. ఇక, సెకెండాఫ్ అంతా నాగ చైతన్య, నాగార్జున మాస్ యాక్టింగ్‌తో అదరగొట్టేశారని.. క్లైమాక్స్ పర్వాలేదు అంటున్నారు. అలాగే నాగార్జున - నాగ చైతన్య కాంబో సీన్స్ సినిమాకే హైలెట్ అని, కొన్ని మాస్ సీన్స్, కలర్‌ఫుల్ సాంగ్స్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయని, ఫస్ట్ హాఫ్ ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే.. బంగార్రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయ్యేదని ఓవర్సీస్ ప్రేక్షకుల టాక్. 

Bangarraju Premiers show talk :

Bangarraju overseas talk 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ