బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన ప్రభాస్ రేంజ్ సాహో మూవీ తో మరింతగా పెరగడమే కాదు.. అతని రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రభాస్ కి ఏ భాషలో క్రేజ్ ఎలా ఉన్నా.. పాన్ ఇండియా మార్కెట్ లో అతి ముఖ్యమైన బాలీవుడ్ లో ప్రభాస్ ఓ రేంజ్ సెట్ చేసుకుని అక్కడి హీరోలకి షాకిచ్చాడు. బాహుబలి క్రేజ్ తో సాహో ఊపుతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. వరస పాన్ ఇండియా మూవీస్ తో బాలీవుడ్ హీరోలకే చుక్కలు చూపిస్తున్నాడు. పారితోషకం విషయంలో ప్రభాస్ బాలీవుడ్ హీరోల తలదన్నే స్థాయికి ఎదిగిపోయాడు.
ఒక్కో సినిమాకి ప్రభాస్ 150 కోట్ల పారితోషకం అందుకుంటూ.. ఇండియా లోనే నెంబర్ వన్ స్టార్ గా ప్రభాస్ ఎదిగిపోయారు అంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు రావడం సంచలనంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అందుకోని పారితోషకం ప్రభాస్ అందుకోవడంతో బాలీవుడ్ హీరోలు తెల్లబోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కి సిద్ధం చెయ్యగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్ తో ప్రభాస్ బాలీవుడ్ కే కాదు.. మిగతా భాషల హీరోలకి చుక్కలు చూపిస్తున్నాడు.