అక్కినేని నాగ చైతన్య టాప్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పబ్లిక్ కి పెద్దగా ఫోకస్ అవ్వని నాగ చైతన్య.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ని పెళ్లాడినా పెద్దగా మారలేదు. నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట అభిప్రాయం భేదాలతో విడిపోయి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సమంత ని అక్కినేని ఫాన్స్ చాలా ట్రోల్ చేసారు. అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి సమంత బాధపడుతూనే తట్టుకుంది. కొన్ని కొన్నిసార్లు ప్రస్టేషన్ లో పోస్ట్ లు పెట్టింది. ఆఖరికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టుకి కూడా ఎక్కింది. తనని మానసికంగా బాధపెడుతున్నారంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఏం జరిగినా, ఎంత జరిగినా నాగ చైతన్య మాత్రం స్పందించలేదు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాడు. తాజాగా బంగార్రాజు ప్రమోషన్స్ లో సమంత తో విడాకుల విషయం మీడియా వారు అడగగానే.. తప్పించుకోకుండా నాగ చైతన్య కూల్ గా సమాధానం ఇవ్వడం చూసిన అక్కినేని ఫాన్స్.. ఈ విడాకుల విషయంలో సమంత ఎంతగా ప్రస్టేట్ అయ్యిందో.. నాగ చైతన్య అంతగా కూల్ గా స్పందించాడు. అంటే మెచ్యూర్డ్ గా స్పందించాడు అంటున్నారు. ఎందుకంటే ఈ విడాకుల నిర్ణయం కలిసి తీసుకున్నామని, ఈ విడాకుల తర్వాత తాను, సమంత సంతోషంగా ఉన్నామంటూ ఎలాంటి హడావిడి లేని సమాధానం ఇచ్చాడు.