మెగాస్టార్ చిరు ఏపీ సీఎం ని కలవడం హాట్ టాపిక్ కాదు ఇంట్రెస్టింగ్ గా మారింది. అందరి చూపు జగన్ - చిరు మీటింగ్ మీదే. మెగాస్టార్ చిరు జగన్ తో ఇండస్ట్రీ విషయాలేమి మాట్లాడతారో అని.. ఇండస్ట్రీ సమస్యలపై జగన్ ఎలా స్పందిస్తారో అంటూ.. ఇలా రకరకాల సందేహాలు. తాజాగా చిరు జగన్ తో భేటీ వివరాలను మీడియా కి వివరించారు. ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, టికెట్ రేట్లు పెంపు విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ పనులు ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.. ఎవరు పడితే వారు టికెట్ రేట్స్ విషయంలో మాట్లాడవద్దని సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని అభ్యర్దిస్తున్నాను అని చిరు చెప్పారు.
నేను సినిమా ఇండస్ట్రీ పెద్దగా జగన్ ని కలవడానికి రాలేదు. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను అని, రెండు వారాల్లో, కొత్త GO వస్తుందని భావిస్తున్నా అని చిరు చెప్పారు. ఇంకా చిరు - జగన్ భేటీలో ఆన్‌లైన్ టికెటింగ్, టిక్కెట్ రేట్లు, జిఓ నెం. 35, అదనపు షోలు, థియేటర్‌లకు కరోనా రిలీఫ్, షూటింగ్ పర్మిట్‌లపై జగన్ - చిరు మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏదో ఒక మంచి చేయాలన్న తపన, ఆలోచన ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఉందని, నేను ఒక పక్షాన ఉండను, అందరినీ సమదృష్టితో చూస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని, ఇండస్ట్రీ సమస్యలపై భయపడొద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని, జగన్ మాటలు తనకి ధైర్యాన్నిచ్చాయని చిరంజీవి చెప్పారు.