ఈ సంక్రాంతి కి బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న బంగార్రాజు మూవీ రేపు శుక్రవారం భోగి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆసక్తికర ప్రమోషన్స్ తో బంగార్రాజు పై విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది టీం. నాగ చైతన్య, కృషి శెట్టి ఇంటర్వూస్, అలాగే బంగార్రాజు మ్యూజికల్ నైట్, ఇంకా బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తూగో పాటుగా నాగార్జున స్పెషల్ ఇంటర్వూస్ అన్ని సినిమాపై అంచనాలు, ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇక నాగార్జున బంగార్రాజు ఇంటర్వ్యూ హైలైట్స్ .
నాగార్జున మాట్లాడుతూ.. బంగార్రాజు కధ కుదిరింది కాబట్టే.. కళ్యాణ్ కృష్ణ తో కలిసి పట్టపట్టి పండగకి రావాలని పూర్తి చేసాం. బంగార్రాజు ఆత్మ కుదిరితే మళ్ళీ రావచ్చు... అంటూ బంగార్రాజు సీక్వెల్ పై నాగార్జున చిన్న క్లూ ఇచ్చారు. గోదావరి యాస కళ్యాణ్ కృష్ణ కి తెలుసు అందుకే సోగ్గాడు అలాగే, బంగార్రాజు లో ఈజీగా చేసేసాం. ఆ గోదారి యాసలోనే పాట కూడ ట్రై చేసాం. చిన్న బంగార్రాజు గా నాగచైతన్య బాగా సెట్ అయ్యాడు. మా సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుందో ఎవ్వరికి చెప్పం. నాకు బడ్జెట్ ఎంతవుతుందో తెలుసు. ఎపెక్ట్స్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాం.
అసలు ఆత్మలు వున్నాయో లేవో నాకు తెలియదు, చిన్నప్పుడు ఆ కధలు వింటూ ఉండేవాడిని. బంగార్రాజు సినిమాలో నాకు నాగ చైతన్య కి కలిపి 7 గురు హీరోయిన్స్ ఉన్నారు. వారితో ఆయన కొడుకు రొమాన్స్ చేసినట్టుగా చెప్పారు. చైతు కి జోడిగా బంగార్రాజు లో నాగ లక్ష్మి గా నటించిన క్రితిశెట్టి 4బాషలు మాట్లాడుతుంది.. నాకు బాగా నచ్చుతుంది.. అంటూ నాగార్జున బంగార్రాజు ముచ్చట్లు చెప్పుకొచ్చారు.