Advertisementt

డివోర్స్ తర్వాత హ్యాపీ గా ఉన్నా

Wed 12th Jan 2022 08:11 PM
naga chaitanya,divorce,samantha,bagarraju movie,nagarjuna,naga chaitanya on divorce  డివోర్స్ తర్వాత హ్యాపీ గా ఉన్నా
Naga Chaitanya gets candid over his divorce with Samantha డివోర్స్ తర్వాత హ్యాపీ గా ఉన్నా
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్యూట్ కపుల్, లవ్లీ కపుల్ నాగ చైతన్య - సమంత నాలుగేళ్ళ ప్రేమ, పెళ్లి బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ విడిపోవడం మాత్రం అక్కినేని ఫాన్స్ కి మాత్రమే కాదు.. చాలామంది సినీ లవర్స్ కి నచ్చలేదు. కానీ విడిపోయారు. అంతా అయ్యిపోయింది. సమంత చైతు తో విడిపోయాక సమంత మాత్రం సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లతో చాలావరకు సమాధానాలు చెప్పింది. తాను ఎంత బాధలో ఉన్నానో అని, ఎంతగా ట్రోల్ అయ్యానో అని చాలా బాధపడింది. కానీ నాగ చైతన్య మాత్రం ఇంతవరకు సమంత తో డివోర్స్ విషయంలో ఎలాంటి స్పందన లేదు.

కానీ బంగార్రాజు ప్రమోషన్స్ లో మాత్రం నాగ చైతన్య తన విడాకుల గురించి మొదటిసారి స్పందించాడు. సమంత తాను విడాకులు తీసుకున్నది, ఇద్దరి మంచి కోసం అని,  ఇది ఇద్దరం కలిసి ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అని, విడాకుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె(సమంత) సంతోషంగా ఉంది, అలాగే నేను కూడా సంతోషంగా ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదే అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అటు సమంత డివోర్స్ తర్వాత భీభత్సంగా బిజీ అవ్వగా.. నాగ చైతన్య కూడా వరస సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా మారాడు.

Naga Chaitanya gets candid over his divorce with Samantha:

Naga Chaitanya on divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ