Advertisementt

ఇంతకీ టైగర్ నాగేశ్వర రావు మీద సినిమా వుందా .....

Wed 12th Jan 2022 07:55 PM
tiger nageswara rao,tiger nageswara rao biopic,ravi teja,bellamkonda srinivas  ఇంతకీ టైగర్ నాగేశ్వర రావు మీద సినిమా వుందా .....
Is there a movie on Tiger Nageswara Rao yet.. ఇంతకీ టైగర్ నాగేశ్వర రావు మీద సినిమా వుందా .....
Advertisement
Ads by CJ

స్టువార్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు మీద సినిమా ఇద్దరు నటులతో అధికారికంగా అనౌన్స్ చేసారు. ముందు బెల్లంకొండ శ్రీనివాస్ స్టువార్టుపురం దొంగ అనే టైటిల్ కే ఎస్ అనే దర్శకుడితో ఆ తరువాత అదే సబ్జెక్టు ని టైగర్ నాగేశ్వరావు రావు పేరు మీద రవితేజ తో కూడా అనౌన్స్ చేసారు. దీనికి వంశీ దర్శకుడు కాగా నిర్మాత వేరే వ్యక్తి. కానీ ఇప్పుడు చూస్తుంటే, ఈ ఇద్దరు నటులు కూడా ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి సిద్ధంగా లేనట్టు కనపడుతోంది. రవితేజ వరస సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కానీ అందులో ఈ టైగర్ నాగేశ్వర రావు ప్రాజెక్ట్ గురించి మాట మంతీ లేదు. 

అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు కొద్ధి రోజుల క్రితం అయ్యింది, కానీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంటే ఈ ఇద్దరు నటులు కూడా దీనికి దూరంగా వున్నారన్నమాట. విషయం ఏంటి అంటే.. ఈమధ్య బయోపిక్ సినిమాలు అస్సలు ఆడటం లేదు... గత పదిహేను సంవత్సరాల నుండి చూస్తే చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి అందులో కేవలం అంకెల్లో లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే ఆడాయి. ఇప్పుడు పరిస్థితులు కూడా బాగాలేవు, అందులోను బయోపిక్ అని రిస్క్ తీసుకుంటే.. అసలకే మోసం రావచ్చు.. అందుకే టైగర్ నాగేశ్వర రావు సినిమా ఆగిపోయినట్టే.. 

తాజా సమాచారం ఏంటి అంటే.. ఒక ప్రముఖ రైటర్ ఈ టైగర్ నాగేశ్వర రావు మీద వెబ్ సిరీస్ తీయాలని అనుకుంటున్నాడట... ఒకే సబ్జెక్టు చెయ్యడానికి ఇంకా ఎంతమంది ఇలా ముందుకు వస్తారో..

Is there a movie on Tiger Nageswara Rao yet..:

Tiger Nageswara rao Biopic Shelved?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ