తెలుగులో బిగ్ బాస్ మొదలైనప్పటినుండి.. అంటే బిగ్ బాస్ సీజన్ 5 వరకు ఎవరో ఒక సింగర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నారు. ఇప్పటివరకు సుమంగళి, గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్, ఈ సీజన్ లో శ్రీరామ చంద్ర పంపారు. ఇలా ఓ డాన్స్ మాస్టర్, ఓ సింగర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఈసారి ఓటిటిలో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఓ సింగర్ వెళ్ళబోతున్నాడట. ఇప్పటివరకు రెండుమూడుసార్లు బిగ్ బాస్ ఆఫర్స్ వచ్చినా.. అతను బిగ్ బాస్ ఆఫర్స్ ని వదులుకున్నాడట. కాని ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడని తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సిక్స్ లో ఎవరెవరు పాల్గొంటారనే విషయంలో బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అందులో మొదటి నాలుగు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కొంతమంది బిగ్ బాస్ సిక్స్ లోకి వస్తారని.. అలాగే సింగర్ హేమచంద్ర మాత్రం ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం గ్యారెంటీ అని, హేమచంద్రతో బిగ్ బాస్ నిర్వహకులు తాజాగా చర్చలు జరిపారని, బిగ్ బాస్ లో పాల్గొనేందుకు అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. అసలైతే హేమచంద్ర నాలుగు, ఐదు సీజన్లలోనే అతడు రావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో షోకు దూరం అయ్యాడు. ఇప్పుడు హేమచంద్రకు అదిరిపోయే ఆఫర్ ఇవ్వడంతో ఓకే చెప్పేశాడట. ఫైనల్ గా హేమచంద్ర బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నాడన్నమాట.