పాన్ ఇండియా స్టార్ గా లైగర్ తో విజయ్ దేవరకొండ ఆగష్టు లో ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాలా తక్కువ టైం లో స్టార్ రేంజ్ కి చేరిన విజయ్ దేవరకొండ క్రేజ్.. బాలీవుడ్ లో విపరీతంగా ఉంది. ప్రస్తుతం పూర్తి జగన్నాధ్ తో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తదుపరి రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. కానీ ఆ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ చేస్తాడో చెయ్యాడో అనే కన్ఫ్యూజన్ లో ఆయన ఫాన్స్ ఉన్నారు. శివ నిర్వాణతో ఓ ప్రాజెక్ట్ దిల్ రాజు బ్యానర్ లో చెయ్యాల్సి ఉంది. అలాగే సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్సమెంట్ వచ్చేసింది.
కానీ విజయ్ దేవరకొండ పూరి తో చేసే లైగర్ హిట్ అయితే.. శివ నిర్వాణ, సుకుమార్ సినిమాలు చెయ్యడని, ఆ ప్రాజెక్ట్స్ రెండూ ఆగిపోతాయని ప్రచారం జరిగింది. సుకుమార్ పుష్ప గనక పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ అయితే సుక్కుతో సినిమా విజయ్ చేస్తాడని, లేదంటే ఆ సినిమా ఆగిపోతుంది ఇలా ఏవేవో రూమర్స్ విజయ్ - సుకుమార్ ప్రాజెక్ట్ పై వినిపించాయి. అయితే సుకుమార్ పుట్టిన రోజు నాడు విజయ్ దేవరకొండ సుకుమార్ హ్యాపీ బర్త్ డే సుకుమార్ సర్ అంటూ.. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా వుండాలని మొరుకుంటున్నాను అంటూ.. మీతో సినిమా చేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని విష్ చెయ్యడంతో పాటుగా సుకుమార్ తో విజయ్ ఉన్న పిక్ ని షేర్ చెయ్యడంతో.. ఒకే ఒక్క పిక్ విజయ్ - సుకుమార్ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేసింది అంటున్నారు రౌడీ ఫాన్స్.