కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదు. వరసగా ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ కి కరోనా సోకడంతో సర్కారు వారి పాట షూటింగ్ ఆగిపోయింది. మోకాలి ఆపరేషన్ తర్వాత మహేష్ దుబాయ్ నుండి రాగానే కరోనా బారిన పడ్డారు. ఇక సర్కారు వారి టీం లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అతని బ్యాండ్ లోని కొంతమంది కరోనా బారిన పడడంతో.. సర్కారు వారి పాట అప్ డేట్ కూడా సంక్రాంతికి అస్తుందో లేదో అనే అనుమానంలో మహేష్ ఫాన్స్ ఉండగా.. తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని, ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నాను అని, హోమ్ ఐసోలేషన్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కీర్తి సురేష్ తెలిపింది. అయ్యయ్యో మహానటిని కూడా వదల్లేదు కరోనా అంటుంటే.. దానితో సర్కారు వారి పాట టీం మొత్తం కరోనా బారిన పడి విలవిలాడుతోంది అంటున్నారు నెటిజెన్స్.