Advertisementt

పవన్ కళ్యాణ్ కొడుక్కి కరోనా

Tue 11th Jan 2022 01:26 PM
renu desai,akira nandan,akira test positive,covid-19,pawan son  పవన్ కళ్యాణ్ కొడుక్కి కరోనా
Pawan Kalyan Son Akira Gets Covid19 పవన్ కళ్యాణ్ కొడుక్కి కరోనా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ సెకండ్ వేవ్ టైం లో కరోనా బారిన పడి బాగా సిక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి చాలా రోజులుపట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కూడా కరోనా బారిన పడడం ఫాన్స్ కి షాకిచ్చింది. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ.. నాకు, అకీరా కి కరోనా సోకింది. మేము ఎలాంటి వేడుకలకి వెళ్ళలేదు.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనకపోయినా.. మేము కరోనా బారిన పడ్డాం, స్వల్ప లక్షలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా థర్డ్ వేవ్ ని తేలిగ్గా తీసుకోకండి, మాస్క్ ధరించండి, చేతులు శుభ్రం చేసుకోండి, నేను అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దామనుకునేలోపు అకీరా కి కరోనా సోకింది. నెను గత ఏడాది వ్యాక్సిన్ వేయించుకున్నాను.. ప్రస్తుతం కరోనా నుండి ఇద్దరం కోలుకుంటున్నామంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసింది.

Pawan Kalyan Son Akira Gets Covid19:

Renu Desai and Akira Nandan test positive for COVID-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ