జూనియర్ ఎన్ టి ఆర్ బావమరిది నార్ని నితిన్ త్వరలో సినిమా ఆరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగ్నేశ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపం లో జరుగుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఒక మలయాళం సినిమా రీమేక్ అని తెలిసింది. మలయాళం లో మూడేళ్లు క్రితం విడుదల అయిన తీవండి అనే సినిమానే చిన్న చిన్న మార్పులు చేసి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మలయాళం లో థోవినో థామస్ లీడ్ యాక్టర్ గా వేయగా, ఆయన రోల్ నే నార్ని నితిన్ వేస్తున్నాడు.
మలయాళం సినిమా బావుండడం కాదు సూపర్ హిట్ అయ్యింది. అందులో టోవినో పెరఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. తెలుగు నేటివిటీ కి సరిపోయేలా కొంచెం మార్పులు చేసి తీస్తున్నారు అంతే. సతీష్ వేగేశ్న ఏ రీమేక్ కోసం చాలామందిని కొత్తవాళ్ళని తీసుకున్నారు.