ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రీసెంట్ గా రెగ్యులర్ షూట్ తో మొదలైన ప్రాజెక్ట్ కే మూవీ పాన్ వరల్డ్ స్టయిల్లో తెరకెక్కుతుంది. ప్రభాస్ సూపర్ మ్యాన్ గా కనిపిస్తాడని.. ఈ సినిమా టైం మిషన్ ఆధారంగా తెరకెక్కుతుంది అని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఆదిత్య 369 దర్శకుడు కూడా ప్రాజెక్ట్ కే స్క్రిప్ట్ వర్క్ లో భాగమయ్యారు. అయితే ఈ సినిమాని అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టె ఆలోచనలో ఉంది టీం.
అయితే తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కే కాన్సెప్ట్.. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ - అలియా భట్ కలయికలో నాగార్జున గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న బ్రహ్మాస్త్ర కాన్సెప్ట్ ఒక్కటే అంటూ వార్తలొస్తున్నాయి. బ్రహ్మాస్త్రని దర్శకనిర్మాతలు మూడు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని రాజమౌళి సమర్పిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే బ్రాహ్మాస్త్ర కథ కూడా ఉండబోతుంది. కొన్ని దశాబ్దాల కిందట ఓ ఆయుధాన్ని హిమాలయ పర్వత శ్రేణుల్లో దాచి పెట్టగా.. ఆ ఆయుధం కోసం కొన్ని పోరాటాలకు జరుగుతాయట.. అదే కథతో అటు బ్రహ్మాస్త్ర, ఇటు ప్రాజెక్ట్ కే కాన్సెప్ట్స్ ఉన్నాయని, ప్రభాస్, రణబీర్ కపూర్ లు సూపర్ హీరోలు గా కనిపిస్తారని.. సో ఈ రెండు కథలకి సిమిలారిటీస్ ఉన్నాయనే ప్రచారం మొదలు అయ్యింది.
అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కే మేకర్స్, బ్రహ్మాస్త్ర మేకర్స్ కలిసి కూర్చుని చర్చించి.. ఒకవేళ నిజంగానే కథలో సిమియాలారిటీస్ ఉంటే.. ప్రాజెక్ట్ కే స్క్రిప్ట్ ని మార్చవచ్చు అనే ఉహాగానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ప్రాజెక్ట్ కేలో మార్పులు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి.