Advertisementt

వర్మ ఇండస్ట్రీ కి ప్రతినిధిగానా? లేక వ్యక్తిగతమా?

Mon 10th Jan 2022 01:11 PM
rgv,perni nani,vijayawada,rgv meet nani,director rgv meet minister perni nani,director ram gopal varma,minister perni nani  వర్మ ఇండస్ట్రీ కి ప్రతినిధిగానా? లేక వ్యక్తిగతమా?
Director RGV meet minister Perni Nani వర్మ ఇండస్ట్రీ కి ప్రతినిధిగానా? లేక వ్యక్తిగతమా?
Advertisement
Ads by CJ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం ఆంధ్ర మినిస్టర్ పేర్ని నానిని మధ్యాహ్నం కలుస్తున్నారు. ఇద్దరి మధ్య సోషల్ మీడియా లో మాటల యుద్ధం జరిగాక, మంత్రి పేర్ని నాని దర్శకుడు ఆర్జీవీ ని చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఆర్జీవీఏ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధిగా వెళుతున్నారా, లేక అతని వ్యక్తిగత హోదాలో వెళుతున్నారా అన్నది తెలియటం లేదు. ఇండస్ట్రీ ప్రతినిధి అయితే ఇంకా కొంత మంది ని తీసుకెళ్లేవారు తనతో పాటు. కానీ ఆర్జీవీ ఒక్కరే వెళుతున్నారు అంటే వ్యక్తిగతంగా కలుస్తున్నారు అనుకోవాలి. 

కానీ ఇండస్ట్రీ అంత ఇప్పుడు వీరిద్దరూ ఏమి మాట్లాడుకుంటారు అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ గా చూస్తున్నారు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళకి ఇంకో అనుమానం కూడా వుంది. ఆర్జీవీ జగన్ కి మంచి మిత్రుడు, అందువల్ల పేర్ని నాని ఆర్జీవీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది అని అనుకుంటున్నారు. చిరంజీవి కూడా ట్వీట్ చేసారు టికెట్ రేట్ పెంచమని, ఆలోచించమని.. అలాగే నాని కూడా మాట్లాడాడు, మరి అప్పుడు ఎవరిని పిలవకుండా, ఇప్పుడు ఆర్జీవీ ఒక్కడినే పిలవటం లో ఆంతర్యం ఏమిటి అని చాలామంది ఇండస్ట్రీ లో వాళ్ళకి ఒక అనుమానం. ఆంధ్ర ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోండి అని అనుమతి ఇచ్చిన ఇవ్వవచ్చు. 

ఎందుకంటే జగన్ మిత్రుడు నాగార్జున సినిమా రిలీజ్ అవుతోంది, వేరే పెద్ద సినిమాలు లేవు, చర్చలకు కూడా తన మనిషే వచ్చాడు, సో ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిచవచ్చు. ఏమైనా ఈ రోజు జరగబోయే చర్చల మీదే అందరి కళ్ళు వున్నాయి.

Director RGV meet minister Perni Nani:

RGV Meet Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ