పుష్ప ద రైజ్ వచ్చేసింది.. హిట్ అయ్యింది.. ఆఖరికి అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసింది. పుష్ప ద రైజ్ లో అల్లు అర్జున్ పెరఫార్మెన్స్, ఆయన మాట్లాడిన రాయలసీమ యాస కి అందరూ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ అన్ని సూపర్బ్ అనేలా ఉండగా.. సినిమా మొత్తానికి సమంత సాంగ్ మెయిన్ హైలెట్ అయ్యింది అంటూ యూత్ చెబుతున్నమాట. ఉ అంటావా మావ ఊఉ అంటావా మావ సాంగ్ లో సమంత చేసిన క్లివేజ్ షో, సమంత చేసిన డాన్స్ అన్ని అదిరిపోయాయి. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ ని ఎవరూ చూడలేదు. సమంత మాస్ స్టెప్స్, సమంత గ్లామర్ లుక్స్ నే అందరూ ఆస్వాదించారు.
అయితే పుష్ప ద రైజ్ లో అదిరిన ఐటెం సాంగ్ లెక్క.. పుష్ప ద రూల్ లో ఓ ఐటెం సాంగ్ ని సుకుమార్ అండ్ దేవిశ్రీ లు ప్లాన్ చేస్తున్నారట. దేవిశ్రీ - సుకుమార్ కాంబో అంటేనే ఐటెం అదుర్స్ అన్న రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు పుష్ప ద రూల్ లో ఎవరి చేత ఆ ఐటెం చేయిస్తారో కానీ.. ఉ అంటావా మావ సాంగ్ ని మించి ఉండాల్సిందే అంటున్నారు. అయితే ఈసారి సమంత ప్లేస్ లోకి బాలీవుడ్ భామని తెచ్చే ప్లాన్ లో ఉన్నారట. ఎందుకంటే పుష్ప సినిమానికి హిందీలో మంచి టాక్ రావడమే కాదు.. అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో.. ఈసారి పుష్ప ఐటెం సాంగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఖర్చయినా బాలీవుడ్ టాప్ హీరోయిన్ నే దించాలని సుక్కు - దేవి లు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
ఇక పుష్ప ద రూల్ షూటింగ్ కూడా సంక్రాతి తర్వాత మొదలు పెట్టి.. ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్, డిసెంబర్ లో రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తారని తెలుస్తుంది.