దీప్తి సునయన, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసి.. ఐదేళ్ల బంధాన్ని తెంపేసుకుంది. పాపం బిగ్ బాస్ వలన షణ్ముఖ్ క్రేజ్ చేజారిపోగా.. ఆఖరికి లవర్ కూడా వదిలేసింది. బిగ్ బాస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చక అతని క్రేజ్ చాలావరకు పడిపోయింది. ఆయన ఫాన్స్ కే షణ్ముఖ్ నచ్చకుండా పోయాడు. సిరి తో చేసిన ఓవర్ ఫ్రెండ్ షిప్ షణ్ముఖ్ అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. బ్రేకప్ అనేది తన నిర్ణయమని, తన జీవితంలో తాను ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకొన్న దీప్తికి షణ్ముఖ్ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అయితే దీప్తి సునయన మాత్రం తన కెరీర్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా, కాలం విలువైనది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది. షణ్ముఖ్ మాత్రం వర్క్ లోకి దిగిపోతున్నట్టుగా పోస్ట్ పెట్టాడు.
అయితే నేడు సోమవారం దీప్తి సునయన బర్త్ డే. ఆమెకి ఫాన్స్, సన్నిహితులు, స్నేహితులు బర్త్ డే విషెస్ చెప్పినా.. అందరూ షణ్ముఖ్ విషెస్ కోసమే ఎదురు చూసారు. షణ్ముఖ్ దీప్తి సునయన పుట్టిన రోజుకి ఆమెని స్పెషల్ గా విష్ చేసాడు. హ్యాపీ బర్త్ డే D(దీప్తి) అంటూ దీప్తి సునయన - షణ్ముఖ్ కలిసి దిగిన ఓ పిక్ తో పాటుగా వారిద్దరూ కలిసి నటించిన మలుపు సాంగ్ మేకింగ్ వీడియో లింక్ ని జత చేసాడు. దానితో దీప్తి బ్రేకప్ చెప్పినా షణ్ముఖ్ వదిలేలా లేడుగా అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.