Advertisementt

ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ అదేనా

Mon 10th Jan 2022 10:40 AM
prabhas,nag ashwin,project k,project k release date locked,deepika padukone  ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ అదేనా
Prabhas Project K Release Date Locked? ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ అదేనా
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసిన టెంక్షన్ లో ఉన్నారు. ఇప్పటివరకు రాధేశ్యామ్ మూడునాలుగుసార్లు పోస్ట్ పోన్ అయినా.. ఈసారి మాత్రం నిర్మాతలకి భారీ లాస్ వచ్చేలా కనబడుతుంది వ్యవహారం, కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు తగ్గి ఎప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలి. అదలా ఉంటే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చెయ్యగా.. అటు సలార్ షూటింగ్ ఇటు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. సలార్ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసారు. 

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేతో రొమాన్స్ చేస్తున్నారు ప్రభాస్. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కే మూవీ ని ప్రభాస్ చాలా త్వరగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారట. సలార్ 2023 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకున్నాడట ప్రభాస్. ఎందుకంటే ఈ ఏడాది రాధేశ్యామ్, ఆగస్టు లో ఆదిపురుష్ వస్తున్నాయ్. వచ్చే ఏడాది సలార్ అలాగే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే రిలీజ్ చేసుకోవచ్చని ప్రభాస్ చూస్తున్నారట. ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ కి రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారని, అది 2023 మే లో రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. భారీ బడ్జెట్ తో అశ్విని దత్ ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Prabhas Project K Release Date Locked?:

Prabhas - Nag Ashwin Project K Release Date Locked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ