షణ్ముఖ్ ఐదేళ్ల ప్రేమని బిగ్ బాస్ సీజన్ 5 వలన వదులుకుంది దీప్తి సునయన. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో సిరి తో చేసిన ఫ్రెండ్ షిప్ నచ్చక దీప్తి సునయన షణ్ముఖ్ ని వ్లదిలేసింది. షణ్ముఖ్ లేకపోయినా తనకేమి బాధలేదని.. తన వెనుక తన తండ్రి ఉన్నాడంటూ సోషల్ మీడియాలో చెబుతుంది. అయితే షణ్ముఖ్ - దీప్తి సునయన విడిపోవడం పట్ల మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ విచారం వ్యక్తం చేసాడు. ఆయన టాప్ 5 కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చాడు.
అయితే తాజాగా షణ్ముఖ్ - దీప్తి విడిపోవడం అనేది చాలా బాధాకరమని, బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ - సిరి చాలా మంచి ఫ్రెండ్స్ అని, కానీ బిగ్ బాస్ లో చూపించే గంట ఎపిసోడ్ వలన తాను ఐదేళ్లుగా ప్రేమించిన వాడికి గుడ్ బై చెప్పడం కరెక్ట్ కాదని, గంట వీడియో ఫుటేజ్ చూసి ఐదేళ్ల ప్రేమని వదులుకోవడం ఆవివేకమని, ప్రేమ అంటేనే నమ్మకం అని మానస్ అన్నాడు. షణ్ముఖ్ - సిరి ఏ తప్పు చెయ్యలేదు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు మానస్.