Advertisementt

రాజేంద్ర ప్రసాద్ కి కరోనా.. ఆసుపత్రిలో చేరిక

Sun 09th Jan 2022 08:11 PM
actor rajendra prasad,rajendra prasad hospitalized,covid 19,corona virus,aig hospital  రాజేంద్ర ప్రసాద్ కి కరోనా.. ఆసుపత్రిలో చేరిక
Rajendra Prasad Gets Covid 19 రాజేంద్ర ప్రసాద్ కి కరోనా.. ఆసుపత్రిలో చేరిక
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కన్నా విపరీతమైన స్పీడుగా ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యాక బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. నిన్నగాక మొన్న తమిళ నటుడు సత్య రాజ్ కరోనా బారిన పడి సీరియస్ కండిషన్ లో చెన్నై ఆసుపత్రిలో చేరారు. ఇక టాలీవుడ్ లో మంచు మనోజ్ నుండి మహేష్ బాబు వరకు కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు చనిపోయినా మహేష్ కి కరోనా కారణంగా ఆఖరి చూపుకి కూడా నోచుకోలేదు. 

అయితే తాజాగా మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానులని ఆందోళనకి గురి చేసింది. రాజేంద్ర ప్రసాద్ కరోనా తో స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది అని, ఆయన వయసు రీత్యా రాజేంద్ర ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ ఈమధ్యనే ఆహా ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సేనాపతి మూవీ తో అదరగొట్టేసారు. ఫస్ట్ టైం ఓటిటి కోసం రాజేంద్ర ప్రసాద్ నెగెటివ్ పాత్రలో కనిపించారు.

 

Rajendra Prasad Gets Covid 19:

Actor Rajendra Prasad Hospitalized

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ