Advertisementt

రివ్యూలు కి కూడా నోచుకుని యంగ్ హీరో సినిమా

Sun 09th Jan 2022 05:33 PM
atithi devo bhava movie,atithi devo bhava movie no reviews,  రివ్యూలు కి కూడా నోచుకుని యంగ్ హీరో సినిమా
Atithi devo bhava movie No reviews రివ్యూలు కి కూడా నోచుకుని యంగ్ హీరో సినిమా
Advertisement
Ads by CJ

యంగ్ హీరోలయినా చిన్న హీరోలయినా వరసబెట్టి సినిమాలు ప్లాప్ అవుతుంటే వాళ్ళ మర్కెట్ ఢమాల్ మని పడిపోతుంది. మళ్ళీ హిట్ కొట్టి పైకి లేవడానికి చాలా తిప్పలు పడాలి. ఒకప్పుడు యంగ్ హీరో నితిన్.. ఇక సినిమాలు వదిలేస్తే బెటర్ అనుకున్న టైం లో నితిన్ ని లవ్ స్టోరీస్ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది సినిమాలు ఆదుకున్నాయి. నిన్నగాక మొన్న వరసగా దాదాపు పది సినిమాల యావరేజ్ టాక్ తో ఉన్న హీరో నాని శ్యామ్ సిగ్ రాయ్ తో పుంజుకున్నాడు. ఇక సాయి కుమార్ వారసుడిగా లవ్లీ లాంటి హిట్స్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అది సాయి కుమార్ కెరీర్ కూడా ఇప్పుడు ఊడైలమాలో ఉంది. వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఫలితమే కనిపించడం లేదు. ప్రస్తుతం అది చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. చక చకా సినిమాలు చేస్తున్నాడు.

అవి ఎలా ఉన్నాయో, దర్శకుల గొప్పదనం ఏమిటో, కథలో బలం ఉందా లేదా అనేది ఆది తేల్చుకోలేకపోతున్నారు. గుడ్డిగా కథని, దర్శకులని ఫాలో అవుతున్నాడు. జిమ్ లో కష్టపడి కండలు పెంచుతున్న ఆది సాయి కుమార్ కి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు మొదటిలో వున్నా ఈ మధ్యకాలంలో  లేవు. ఇక ఆది సాయి కుమార్ సినిమా వస్తుంది అంటే మీడియాలో సందడి లేదు, బాక్సాఫీసు దగ్గర ఊపు కనిపించడం లేదు. ఇలా వస్తున్నాయ్ ఆలా వెళుతున్నాయి. ఆది నటించిన అతిథి దేవో భవ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతిథి దేవో భవ సినిమా వచ్చింది, వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమాకి కనీసం రివ్యూలు కూడా రాయలేదంటే ఆది సాయి కుమార్ సినిమా రేంజ్ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ పెద్ద సినిమాలు లేకపోయినా ఈ వారం అది సినిమా థియేటర్స్ లోనే పూర్ టాక్ తో రన్ అవుతుంది. పాపం ఆది.. నెక్స్ట్ మూవీస్ అయినా కేర్ తీసుకొని గట్టిక్కిస్తే ఓకె.. లేదంటే ముందు ముందు వచ్చే మంచి సినిమాలు కూడా జనాలు వదిలేసే ప్రమాదం లేకపోలేదు.

Atithi devo bhava movie No reviews :

Atithi devo bhava movie poor collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ