Advertisementt

కలర్ ఫుల్ ప్రమోషన్స్

Sun 09th Jan 2022 11:58 AM
nagarjuna,bangarraju,bangarraju colorful promotions,naga chaitanya,krithi shetty,ramyakrishna,kalyan krishna  కలర్ ఫుల్ ప్రమోషన్స్
Colorful Promotions కలర్ ఫుల్ ప్రమోషన్స్
Advertisement
Ads by CJ

నాగార్జున - నాగ చైతన్య కలయికలో బుల్లి మల్టీస్టారర్ గా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన బంగార్రాజు సినిమా విడుదలకు కౌన్ డౌన్ మొదలైపోయింది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫై  అందరిలో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం, రిలీజ్ అయిన బంగార్రాజు సాంగ్స్, టీజర్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చెయ్యడమే కాదు.. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపించడం నాగార్జునకి ప్లస్ అయ్యింది. నాగ చైతన్య లుక్, కృతి శెట్టి పల్లెటూరి నాగ లక్ష్మి లుక్స్ అన్ని సూపర్ అనేలా ఉన్నాయి. ఇక జనవరి 14 న విడుదలకు రెడీ అయిన బంగార్రాజుకి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇక నాగార్జున బంగార్రాజు కి కలర్ ఫుల్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి తో కలిసి నాగార్జున.. ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఇక ఇంటర్వూస్ లో, ప్రెస్ మీట్స్ లో బంగార్రాజు కి స్పెషల్ సంక్రాంతి సెట్ వేసి.. అలంకరణలతో కలర్ ఫుల్ గా కనిపించేలా చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం బంగార్రాజు మ్యూజికల్ నైట్ అంటూ హంగామా చెయ్యబోతున్నారు. మరి ఈ ఈవెంట్ కి నాగార్జున - నాగ చైతన్యలు పంచె కట్టుతో హాజరవుతారేమో అంటూ అక్కినేని ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. కృతి శెట్టి ఎలాగూ ట్రెడిషనల్ గానే వస్తుంది. 

Colorful Promotions:

Bangarraju Colorful Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ