అన్నదమ్ముల అనుబంధం అంటే రమేష్ బాబు మరియు మహేష్ బాబు లదే అని చెప్పొచ్చు. అంతగా ఇద్దరు ఒకరిని ఒకరు అభిమానించుకుంటారు. అప్పట్లో కృష్ణ గారు చాలా బిజీ గా ఉండేవారు, రెండు మూడు షిఫ్ట్ లు పని చేసేవారు. ఇంటికి రావటం పిల్లల్ని చూసుకునే టైం కూడా కృష్ణ గారికి అప్పట్లో కుదిరేది కాదు. అలాంటి సమయం లో మహేష్ బాబు కి రమేష్ బాబే తండ్రిగా అన్నీ చూసుకున్నాడు. మహేష్ కి ఏమి కావాల్సి వచ్చినా కూడా, అన్నయ్యని అడిగేవాడు తప్ప వేరేవాళ్లని అడిగేవాడు కాదు. మహేష్ కి కూడా నాన్న కృష్ణ గారు అంటే భయం ఉండేది కాదు, కానీ అన్నయ్య రమేష్ అంటే ఎక్కువ భయం.
వారిద్దరూ అప్పటినుండి ఒకరి మీద ఒకరు అభిమానం పెంచుకున్నారు. రమేష్ బాబు కి ఎటువంటి చిన్న జ్వరం వచ్చినా కూడా మహేష్ తల్లడిల్లిపోయేవాడు. అతడు సినిమా షూటింగ్ సమయం లో ఒకసారి మహేష్ కొంచెం డల్ గా కనపడితే, దర్శకుడు ఎందుకు అలా వున్నారు అని అడిగితే, అన్నయ్య రమేష్ కి వొంట్లో బాగోలేదు అని చెప్పాడట మహేష్. వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేసి, మీరు వెళ్లి మీ అన్నయ్యతో వుండండి, ఈరోజు షూటింగ్ వద్దు అన్నారట. అంటే అంత ప్రాణం మహేష్ కి రమేష్ అంటే. అటువంటి రమేష్ బాబు ఈరోజు ఆకస్మికంగా తమ్ముడిని విడిచి వెళ్ళిపోయాడు. మహేష్ బాబు కి కరోనా వచ్చి ప్రస్తుతం క్వారంటైన్ లో వున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేస్తారో చూడాలి.