దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాని హడావిడిగా టెంక్షన్స్ తో రిలీజ్ చేసి ఇప్పుడు కూల్ గా కూర్చున్నారు. హడావిడిగా రిలీజ్ చేస్తేనేమి.. మేకర్స్ ని లాస్ అవ్వకుండా కాపాడారు. లేదంటే పుష్ప సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యేది. కానీ ఆ గండాన్ని ఎలాగో దాటేసారు. అయితే తాజాగా సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ గారు గురించి, టాప్ డైరెక్టర్ మణిరత్నం గారి గురించి చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గారి షూటింగ్ కి వెళ్ళినప్పుడు రజనీగారు తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నారు. కానీ నాకు చేతులు కళ్ళు ఒణికిపోయాయి. ఆర్య సినిమాలో ట్రైన్ లో హీరోయిన్ జుట్టు ఎగిరే సీన్ బాగా తీశారు అని మెచ్చుకోవడమే కాకుండా తనని కుర్చీ వేసి కూర్చోబెట్టారని చెప్పారు సుక్కు. రజినీకాంత్ ఎంతో సంస్కారం ఉన్న హీరో అని అందుకే అంతగొప్పవారయ్యారని చెప్పారు సుక్కు.
ఇక తనకి గీతాంజలి సినిమా చూసాక మణిరత్నం గారంటే ఇష్టం వచ్చేసింది అని, ఆ సినిమా తర్వాత తాను దర్శకుడిని అవ్వాలని అనుకున్నా అని, ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు ఓ ఈవెంట్ లో మణిరత్నం సర్ ని కలుద్దామని చాలా సేపు కూర్చున్నా అని, కానీ మణి రత్నం గారు హీరోయిన్ శోభనతో ఏదో డిస్కర్స్ చేస్తున్నారని, ఇక నేను వెయిట్ చెయ్యలేక సర్ అని దగ్గరకి వెళ్లగా ఆయన కోపంగా ఏంటి వెళ్ళు అనగానే బాధవేసింది అని, కానీ దర్శకులు బిజీగా వున్నప్పుడు డిస్టర్బ్ చెయ్యొద్దు అనే విషయం తాను దర్శకుడిగా మారాక తెలిసింది అని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు తాను మణిరత్నం గారిని కలవలేదని చెప్పుకొచ్చారు.
ఇక తనకి ఓ రెండు సినిమాలు రీమేక్ చేస్తే బావుంటుంది అనిపించినట్లుగా సుకుమార్ చెప్పారు. తమిళనాట హిట్ అయిన విక్రమ్ వేద రీమేక్ చేస్తే బావుంటుంది అని అనిపించింది, అలాగే విష్ణు విశాల్ రచ్చసన్ రీమేక్ చేస్తే బావుంటుంది అనిపించినట్లుగా సుకుమార్ చెప్పుకొచ్చారు.