Advertisementt

నిధి అగర్వాల్ ప్రేమాయణం

Sat 08th Jan 2022 07:29 PM
nidhi agarwal,simbu,staying together,kollywood,eshwaran  నిధి అగర్వాల్ ప్రేమాయణం
Nidhi Agarwal-Shimbu likely marriage news goes viral నిధి అగర్వాల్ ప్రేమాయణం
Advertisement
Ads by CJ

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో గ్లామర్ రేంజ్ చూపించినా క్లిక్ అవ్వని నిధి అగర్వాల్.. పూరి జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. ఆ సినిమా తర్వాత నిధి అగర్వాల్ రేంజ్ మారుతుంది అనుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ప్లేస్ కొట్టేసింది. క్రిష్ - పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లో నిధి అగర్వాల్ యువరాణి గెటప్ లో నటిస్తుంది. ఆ తర్వాత డెబ్యూ హీరో గల్లా అశోక్ సరసన హీరో సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో మూవీ సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే నిధి అగర్వాల్ ఇప్పుడు ప్రేమలో పడిందట. అది కూడా కోలీవుడ్ ముదురు హీరో తో అంటున్నారు.

గత ఏడాది కోలీవుడ్ సీనియర్ హీరో లిస్ట్ లోకి చేరిన శింబు తో నిధి అగర్వాల్ ఈశ్వరన్ మూవీలో నటించింది. ఆ మూవీ షూటింగ్ టైం లో హీరో శింబు తో నిధి అగర్వాల్ ప్రేమలో పడింది అని.. వీరిద్దరూ గత్ ఏడాది నుండే ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. శింబు గతంలో నయనతార, హన్సిక లాంటి హీరోయిన్స్ తో లవ్ ఎఫ్ఫైర్ నడిపి.. తర్వాత బ్రేకప్స్ కూడా అయ్యాయి. చివరికి హీరోగానూ లాంగ్ గ్యాప్ తో మళ్ళీ సినిమాల్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పడు నిధి ప్రేమాయణంలో శింబు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా నిధి - శింబు కలిసే ఉంటున్నారట. ఇక నిధి అగర్వాల్ - శింబులు పెద్దలని ఒప్పించి మరీ పెళ్ళికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

Nidhi Agarwal-Shimbu likely marriage news goes viral:

Nidhi Agarwal and Simbu staying together

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ