పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమా ఫంక్షన్స్ వాడుకున్నారంటూ టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యు ఇప్పటి సమస్య కాదు, ఆ ఇష్యు వలన కోర్టులకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. పుండుపడితే మందు వెయ్యాలి కానీ.. దాన్ని రేపితే ఇలాగే ఉంటుంది.. టికెట్ రేట్స్ అనే విషయం చాలా సింపుల్ ఇష్యు. గవర్నమెంట్ తో ఎలా మాట్లాడితే అది చక్కబడుతుందో చూడాల్సింది పోయి ఇష్యుని పెద్దది చేసారు. ఎవరిష్టం, వచ్చినట్లుగా వారు మట్లాడారు.
ఓ ఆపార్టీ లో ఉండి గవర్నమెంట్ మీద యుద్ధం చెయ్యాలి అంటే సినిమా ఈవెంట్స్ ని అడ్డుపెట్టుకోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. పార్టీ పెట్టుకుని గవర్నమెంట్ ని తిడితే అది ఇండస్ట్రీకి నష్టం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు. నీకు ప్రభుత్వం ఇష్టంలేదంటే నోటికొచినట్టుగా తిడితే.. వాళ్ళు నీకన్నా ఎక్కువ తిడతారు. పవన్ కానీ, నాని, సిద్దార్థ్ వీళ్లంతా మాట్లాడింది చూస్తే చిన్నపిల్లలు మాట్లాడింది లా ఉంది. పవన్ కళ్యాణ్ టికెట్ ఇష్యుపై ఆయన మేనల్లుడు సాయి ధరమ్ రిపబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడి.. సినిమా ఇండస్ట్రీకి లాభం లేకపోగా.. రిపబ్లిక్ కి నష్టం కలిగింది.
రిపబ్లిక్ సినిమా కాన్సెప్ట్ చాలా మంచిది. కేవలం పవన్ వైసిపి ప్రభుత్వాన్ని తిట్టినందువలనే ఆ సినిమాకి అంతగా లాస్ వచ్చింది. లేదంటే సాయి తేజ్ రిపబ్లిక్ మూవీ మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. పవన్ కళ్యాణ్ మాట్లాడడం వలనే సినిమా పోయింది. పవన్ వలన ఓ మంచి సినిమా చచ్చిపోయింది అంటూ తమ్మారెడ్డి పవన్ పై విరుచుకుపడ్డారు.