రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపిల్ ఆర్ ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడటం తో అందులో నటించిన ఇద్దరు కథా నాయకుల్లో జూనియర్ ఎన్ టి ఆర్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. మిగతా నటీ నటులతో పోలిస్తే రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్ టి ఆర్ ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. అలాగే ప్రమోషన్స్ కి కూడా దేశం అంతా తిరిగి విపరీతంగా ప్రమోట్ చేసారు, చివరికి సినిమా విడుదల వాయిదా పడింది. దీని వల్ల ఎవరు బాగా నష్ట పోయారు అంటే జూనియర్ ఎన్ టి ఆర్ అని చూపొచ్చు.
ఎందుకంటే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చెయ్యలేడు, ఎందుకంటే ఎన్టీఆర్ నెక్స్ట్ చెయ్యాల్సిన దర్శకుడు కొరటాల శివ ఇంకా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో బిజీ గా వున్నాడు. అందుకని ఇంకా చాలా కాలం ఎదురు చూడాలి. ఇంకా రామ్ చరణ్ కి పరవాలేదు, ట్రిపిల్ ఆర్ వాయిదా పడినా కూడా, తదుపరి ఆచార్య సినిమా కూడా విడుదలకి రెడీ అవుతుంది. అదీ కాకుండా చరణ్ ఇంకో సినిమా దర్శకుడు శంకర్ తో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు కూడా. అతనికి ఇప్పుడు ట్రిపిల్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అయినా కొంచెం వరసగా సినిమాలు రెడీ గా వున్నాయి. కానీ జూనియర్ ఎన్ టి ఆర్ కే ఏమి లేకుండా ఖాళీగా కూర్చోవాలి. ఈ సంవత్సరం అన్నీ బాగుంటే ట్రిపుల్ ఆర్ మాత్రమే విడుదల, తరువాత సినిమా అంతా అనిశ్చితిలోనే వుంది. పాపం జూనియర్ ఎన్ టి ఆర్.