బాలకృష్ణ అఖండ మైన విజయంతో.. NBK107 షూట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. మరోపక్క అల్లు అరవింద్ ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ కామెడీ చేస్తున్నారు. ఆహా అన్ స్టాపబుల్ ని బాలకృష్ణ తన చిలిపి చేష్టలతో ఎక్కడికో తీసుకెళుతున్నారు. ఆ షో కి హాజరైన గెస్ట్ లతో బాలయ్య విపరీతమైన ఫన్ జనరేట్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్స్ పై అంచనాలు పెంచేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో అన్ స్టాపబుల్ షో ని ఆడిస్తున్న బాలకృష్ణ ఎనేర్జి, ఆయన ఉత్సాహం, ఆయన స్టయిల్ అన్ని షో కి ప్లస్ అవుతున్నాయి. ఇక ఈ షో కి వచ్చే గెస్ట్ లు కూడా బాలయ్య తో చేరి స్టేజ్ పై అదరగొట్టేస్తున్నారు.
ఇప్పటికే స్టార్ హీరోలు హాజరైన ఈ షోకి సూపర్ స్టార్ మహేష్ కూడా వచ్చారు. ఆ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది. ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ షోకి హాజరయ్యారు. గోవాలో లైగర్ సెట్స్ లో బాలయ్య సందడి చేసారు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రౌడీ హీరో సందడి చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ కి బాలయ్య పంచె కట్టుతో రాగా.. రౌడీ హీరో స్టైలిష్ గా హాజరయ్యారు. మరి వీరి ఎపిసోడ్ పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇంకా ఈ ఎపిసోడ్ లో హీరోయిన్ ఛార్మి కూడా వచ్చారు. లైగర్ హీరో, లైగర్ నిర్మాత ఛార్మి తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఇప్పుడు రౌడీ ఫాన్స్ తో పాటుగా నందమూరి, మెగా ఫాన్స్ కలిసి ఎదురు చూస్తున్నారు.