అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద బిజినెస్ మాన్ అయినా మై హోమ్ రామేశ్వరావు తో చేతులు కలిపి ఒక ఓ టి టి ఛానల్ స్టార్ట్ చేసారు. దీనికి స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు చాలా ప్రమోట్ చేసారు. పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఛానల్ ని ఎలా ప్రమోట్ చెయ్యాలో అని ఆలోచించి ఆ లెక్కలోనే ప్రమోషన్స్ చేసారు. కానీ ఇవ్వేవీ ఆ ఓ టి టి ఈ ఛానల్ ని ముందుకు తీసుకు వెళ్లలేకపోయాయి. ఇంతమంది చెయ్యలేని పని మన బాలయ్య ఒక్క టాక్ షో తో ప్రభంజనం సృషించాడు. బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో అతిధి ఎవరన్నా విషయం ఎవరికి అక్కరలేదు.. కానీ బాలయ్య ఏంటి టాక్ షో చెయ్యటం ఏంటి, ఆయన ఎలా మాట్లాడతారు, ఏమి మాట్లాడతారు అన్న ఉత్సుకతే ఎక్కువ ప్రేక్షకుల్లో రేకెత్తింది.
దీనితో అన్ స్టాపబుల్ షో కి విపరీతమయిన పేరు రావటమే కాకుండా, ఆహా ఛానల్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ షో కి వచ్చిన అతిధిలతో బాలయ్య తనదయిన స్టైల్ లో ఒక ఆట ఆడుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఈ షో లాస్ట్ ఎపిసోడ్ మహేష్ బాబు తో అది సంక్రాంతి టైం లో వస్తుంది. అంటే ఈ షో వలనే ఈ ఛానల్ పేరు మారుమోగుతోంది సంక్రాంతికి. అంత జై బాలయ్య ప్రభావం. చూసారా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఓ టి టి కోసం రెండేళ్లుగా చెయ్యలేని పని, బాలయ్య కొద్ది వారాల్లో చేసి చూపించి సంచలనం సృష్టించారు.