తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నవారంతా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో టికెట్ రేట్స్ పెంచమని విన్నపాలు పెడుతుంటే, ఒక్క నాగార్జున మాత్రం తనకి ప్రస్తుతం వున్న టికెట్ రేట్స్ చాలు అంటున్నారు. మొన్న జరిగిన బంగార్రాజు ప్రెస్ మీట్ లో ఒక ప్రశ్నకు నాగార్జున తన సినిమాకి ఇప్పుడున్న టికెట్ రేట్స్ సరిపోతాయి అని, తాను ఆ విషయంలో హ్యాపీ వున్నా అని చెప్తున్నారు. దీనివల్ల ఏమి అర్థం అయింది, నాగార్జున తన బంగార్రాజు సినిమా స్మాల్ బడ్జెట్ సినిమా అని ఒప్పేసుకున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తనకి మంచి స్నేహితుడు. అందుకే ఇండస్ట్రీ అంతా ఒకటి అంటే నాగార్జున దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ సినిమా ఓ టి టి లో రిలీజ్ చేద్దామని ముందు అనుకున్నారు.
కానీ కొన్ని సినిమాలు రిలీజ్ చెయ్యడం, జనాలు థియేటర్స్ కి రావటం చూసి సంక్రాంతి కి తన సినిమా కూడా సినిమా హాల్స్ లో రిలీజ్ చేస్తున్నాడు. సినిమా బాగుంటే జనాలు వస్తారు, అది బోనస్ అవుతుంది అని. అంతే కానీ, నాగార్జున ఏమి యాభయి కోట్లు లేక వంద కోట్లు టార్గెట్ ఏమి పెట్టుకోలేదు. తన సినిమాలు అన్నీ, ముఖ్యంగా తనే నిర్మాత అయినప్పుడు, తన సినిమా బడ్జెట్ పదిహేను కోట్లకి మించకుండా చూసుకుంటారు. మరి అలాంటప్పుడు అతనికి టికెట్ రేట్స్ తో పని ఏంటి. ఆయన డబ్బులు అతనికి వచ్చేస్తాయి, ఎందుకంటే లో బడ్జెట్ సినిమా కదా. మరి నాని అంత కూడా చెయ్యలేరు నాగార్జున అని ఇండస్ట్రీ లో ఒకటే టాక్. నాగార్జున సినిమా ఓ టి టి లో వెయ్యడమే బెస్ట్ అంటున్నారు ఇంకొందరు. మరోపక్క ఏపీలో బంగార్రాజు బాయ్ కట్ అంటూ డిస్ట్రిబ్యూటర్స్ హడావిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ చేస్తున్నారు నాగార్జున.