ఈ రోజు దేశంలోని సినీ లవర్స్ అంతా పూనకాలతో ఊగిపోయేరోజు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ అయితే రచ్చే. థియేటర్స్ దగ్గర బ్యానెర్లు, ప్రీమియర్ షోస్ అంటూ నానా హంగామా ఉండేది. పాలాభిషేకాలు అంటూ హడావిడి చేసేవారు. అది ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యి ఉంటె. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ హంగామా అది వేరే లెవెల్ లో ఉండేది థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కొట్టేచ్చేది. ఎన్నో అంచనాలు, ఎంతో ఆత్రుత, ఎంతో క్యూరియాసిటీ, భారీ బడ్జెట్.. అబ్బో ఆర్.ఆర్.ఆర్ గురించి ఇది బావుంటుంది, ఇది గొప్ప అని చెప్పడానికి లేదు.. అన్నీ గొప్పలే.
కానీ కరోనా నే మరోసారి సినీ లవర్స్ ఆశలపై నీళ్లు చల్లింది. కరోనా థర్డ్ వేవ్ ఉధృతి తో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ వాయిదా వేశారు. లేదంటే ఈపాటికి ఓవర్సీస్ టాక్, ఓవర్సీస్ సందడి, సోషల్ మీడియా టాక్, పబ్లిక్ రివ్యూస్ అంటూ మీడియా హడావిడి, ఛానల్స్ థియేటర్స్ దగ్గర ఫాన్స్ హడావిడి లైవ్ టెలికాస్ట్, అలాగే బాక్సాఫీసు దగ్గర కోలాహలం ఇలా ప్రపంచం అంతా పండగ చేసుకునేది. కానీ కరోనా అంతా నాశనం చేసింది. ఫాన్స్ ఉసూరుమనేలా చేసింది, ప్రేక్షకులు ఢీలా పడేలా చేసింది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి చేసిన భారీ ప్రమోషన్స్ కి ఓపెనింగ్స్ భీబత్సంగా ఉండేది. ఆయన ప్రమోషన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. హీరోల కష్టం గాల్లో కలిసిపోయింది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అనేది తెలియని కన్ఫ్యూజన్ లో ఫాన్స్, ప్రేక్షకులు ఉండిపోయారు.