Advertisementt

ఆది ఖాతాలో మరో..

Fri 07th Jan 2022 09:58 AM
hero aadi sai kumar,atithi devo bhava movie,aadi sai kumar,sai kumar,aadi movies  ఆది ఖాతాలో మరో..
Hero Aadi Sai Kumar about Atithi Devo Bhava Movie ఆది ఖాతాలో మరో..
Advertisement
Ads by CJ

ఆది సాయి కుమార్.. సాయి కుమార్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ.. ఆయనకి సరైన హిట్ ఒక్కటీ తగలడం లేదు. కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసిన ఆది సాయి కుమార్ కి కొన్ని సక్సెస్ లు ఉన్నా.. అవి ఆది కి అంతగా ఉపయోగపడలేదు. వరస ప్లాప్స్ ఉన్నా.. ఆది మాత్రం మాత్రం తన ప్రయత్నం లో లోపం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ గ్యాప్ తీసుకోవడం లేదు. మరి కథ ల ఎంపిక లో లోపమో.. లేదంటే ఆది సాయి కుమార్ ఎంచుకున్న దర్శకుల లోపమో కానీ.. ఆయనకి సరైన హిట్ అన్నది మాత్రం తగలడం లేదు.

నా సినిమా ఈసారి హిట్. ఇకపై మంచి సినిమాలు చేస్తాను అని ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వూస్ లో ఆది చెప్పడం కామన్ అయ్యింది.. ప్రేక్షకుడికి బోర్ కొట్టింది. చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అంతంత మాత్రం ప్రమోషన్ తో అందులో ముందుగా అతిధి దేవో భవ ని థియేటర్స్ కి తీసుకువచ్చారు మేకర్స్. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వాల్సిన డేట్ కి ఆ సినిమా వాయిదా పడడం తో.. ఆది హడావిడిగా అధితి దేవో భవ అంటూ వచ్చేసాడు. నేడు శుక్రవారం రిలీజ్ అయిన.. ఈ సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారా అని ఆది కూడా వెయిట్ చేసేలా ఏమి లేదు. అతిధి దేవో భవ కి అంతగా హైప్ లేక పోవటం, మళ్ళీ తన ఖాతాలో మరో అపజయం వచ్చేలా వుంది.. ఆది పరిస్థితి. ఎందుకంటే వరసగా ప్లాప్స్, మార్కెట్ రోజురోజుకి పడిపోతుంది.. ఇకపై వచ్చే సినిమాలకు మర్కెట్ ఉండదు.. సో ఇదైనా హిట్ అవ్వాలని ఆది అనుకుంటున్నాడు.

అధితి దేవో భవ హడావిడిగా రిలీజ్ డేట్ ఇచ్చి.. హడావిడి ప్రమోషన్స్ లో వెనకబడి ఉన్న అధితి దేవో భవ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఆది ఖాతాలో మరో ప్లాప్  పడుతుందో.. కాదు ఏదో వండర్ జరిగి కొత్తగా హిట్ కొడతాడా చూద్దాం.

Hero Aadi Sai Kumar about Atithi Devo Bhava Movie:

Aadi Sai Kumar about Atithi Devo Bhava Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ