Advertisementt

షణ్ముఖ్ నిజ స్వరూపం బయటపెట్టిన కాజల్

Thu 06th Jan 2022 10:22 PM
kajal,rj kajal,bigg boss,shanmukh,siri,manas,sunny  షణ్ముఖ్ నిజ స్వరూపం బయటపెట్టిన కాజల్
RJ Kajal Sensational comments on Shanmukh షణ్ముఖ్ నిజ స్వరూపం బయటపెట్టిన కాజల్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో యూట్యూబర్, షార్ట్ ఫిలిం హీరో, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగి చివరికి రన్నర్ గా బయటికి వచ్చాడు. దానికి కారణం షణ్ముఖ్ చేసిన పనులే. తనకంటూ ఓ గిరి గీసుకుని ఆ గిరిలో ఉన్నవాళ్లు తన మాటే వినేలా చేసుకుని.. కేవలం మొజ్ రూమ్ కే పరిమితమై, టాస్క్ ల పరంగా యాక్టీవ్ గా లేకుండా, సిరి తో అతి ఫ్రెండ్ షిప్ చెయ్యడం ఇవన్నీ షణ్ముఖ్ ని విన్నర్ ని చెయ్యకుండా ఆపేసాయి. ఇక సిరి తో హగ్గులు, ముద్దుల విషయంలో విపరీతమైన నెగెటివిటి మూట గట్టుకున్నాడు. అయితే షణ్ముఖ్ హౌస్ లో ఎలా ఉండేవాడో అతని మెంటాలిటీ ఏమిటో, అతని చెప్పిందే జరగాలని ఎలా అనుకునేవాడో మరో కంటెస్టెంట్ కాజల్ బయట పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

కాజల్ ని అందరూ సన్నీ, మానస్ గ్రూప్ లోకి వెళ్లి అవసరం కోసం స్నేహం చేసింది అని, ఆమె తగవులు పెడుతుంది అని, అలాగే కాజల్ ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామందే అన్నారు. అయితే తాజాగా మీరు సన్నీ - మానస్ తో ఎక్కువగా ఉన్నారు. అంతకుముందు షన్ను తో క్లోజ్ గా ఉన్న మీరు మళ్ళీ సన్నీకి మానస్ కి ఎలా దగ్గరయ్యారని కాజల్ ని ఓ ఛానల్ యాంకర్ ని అడగగా.. అప్పడు షణ్ముఖ్ దగ్గర క్లోజ్ గా వున్నప్పుడు తానొక మాట అన్నాడు.. నువ్వు ఉంటే నాతోనే ఉండాలి.. ఎవరితో మట్లాడకూడదు అని అనేశాడు. 

అది నేను తీసుకోలేకపోయాను. అందుకే షణ్ముఖ్ జోన్ లో ఉంటే కేవలం వాళ్ళ వరకే ఇంకో ప్రపంచం ఉండదు. అందుకే నేను మెల్లగా సన్నీ, మానస్ లకి దగ్గరయ్యాను. అందరితో నేను క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నం చేసి హ్యాండ్ ఇచ్చినా ఎవరూ పట్టించుకునేవారు కాదు.. నేనేదో స్ట్రాటజిలకు బ్రాండ్ అంబాసిడర్ ని అని అనుకునేవారు అంటూ కాజల్ బిగ్ బాస్ లో షణ్ముఖ్ ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

RJ Kajal Sensational comments on Shanmukh:

RJ Kajal comments on Shanmukh Jashwanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ