రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడే కాదు, మంచి మాటకారి కూడా. అతనితో ఎటువంటి టాపిక్ అయినా మాట్లాడడం కష్టం. అందుకే అతను సోషల్ మీడియా లో ఎన్నో సార్లు చాలా కాంట్రవర్సీ ట్వీట్స్ పెట్టినా కూడా ఎవరికీ దొరకలేదు. అతనికి అన్ని సబ్జక్ట్స్ లో చాలా అవగాహన వుంది. అయితే అటువంటి ఆర్జీవితో మన ఆంధ్ర మంత్రి నాని గారు పెట్టుకున్నారు. టికెట్స్ రేట్స్ మీద ఆర్జీవీ ఇచ్చిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. దానికి ఆర్జీవీ మళ్ళీ ఒక్కో సమాధానానికి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
ఇంకేముంది ఏపీ మంత్రి గారికి దగ్గర మరి మాటల్లేవ్. ఆర్జీవీ అడగ్గానే వెంటనే వేరే మాట్లాడకుండా కలుద్దాం అన్నారు. ఆర్జీవితో అంటే మాటలా, ఎవరయినా అతని ముందు మాట్లాడలేరు. ఇప్పుడు కలుద్దాం అన్నాక ఆర్జీవీ కి ఆహ్వానం ఇవ్వాలి, కలవాలి, ఇండస్ట్రీ విషయాలు మాట్లాడాలి, ముఖ్యంగా టికెట్ రేట్స్ గురించి చర్చించాలి. ఇప్పుడు ఆర్జీవీ వైపు అంతా చూస్తున్నారు, ఏమి మాట్లాడతారు, ఎలా చక్కబెడతారు చేస్తారు ఈ సున్నితమయిన విషయాన్ని అని.. మరి ఆర్జినా మజాకా నా అనేది అందుకే.