తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరి తరువాత ఒకరు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ రోజు గురువారం మంచు లక్ష్మి తనకి కరోనా సోకినట్టుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తాజాగా ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. కొద్ది సేపటి క్రితం మహేష్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని అయితే దీని ప్రభావం పెద్దగా లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఐసొలేషన్ లో ఉన్నట్టు, డాక్టర్స్ గైడెన్స్ తీసుకుంటున్నట్టు చెప్పారు. తనతో కలిసి వున్నవాళ్లందరిని టెస్ట్ చేయించుకోమని రిక్వెస్ట్ కూడా చేసారు.
ఇదే సందర్భంగా అందరిని వాక్సినేషన్ వేయించుకోండి అని సలహా కూడా ఇచ్చారు మహేష్ బాబు. అన్ని జాగ్రత్తలు పాటించి ఇంట్లో సేఫ్ గా వుండండి అని అందరికి విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. మోకాలి ఆపరేషన్ తర్వాత మహేష్ రీసెంట్ గానే దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చారు. త్వరలోనే సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉండగా.. అది ఇప్పుడిప్పుడే అయ్యేట్టు కనిపించటం లేదు.. మహేష్ కి కరోనా తగ్గాలి.. కోలుకోవాలి.. అప్పుడు కానీ షూటింగ్ మొదలు కాదు.