Advertisementt

స్టార్టింగ్ స్టార్టింగే బోర్ కొట్టిస్తున్నారు

Thu 06th Jan 2022 08:17 PM
aadi sai kumar,athidi devo bhava,rana,1945,aadi sai kumar athidi devo bhava,rana 1945  స్టార్టింగ్ స్టార్టింగే బోర్ కొట్టిస్తున్నారు
Rana Vs Aadi Sai Kumar స్టార్టింగ్ స్టార్టింగే బోర్ కొట్టిస్తున్నారు
Advertisement
Ads by CJ

2021 అఖండ, పుష్ప, శ్యామ్ సింగ్ రాయ్ హిట్స్ తో హుషారుగా బాక్సాఫీసుని క్లోజ్ చేసింది టాలీవుడ్. చివరిలో చిన్న సినిమా విడుదలై అది ప్లాప్ కొట్టినా పెద్దగా లెక్కల్లోకి రాలేదు. ఇక 2022 లోకి ఎన్నో ఆశలతో, ఎంతో అతృతతో మొదలు పెట్టగానే ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ ఫోన్ అవడం ఫాన్స్ ని డిస్పాయింట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అయిన వారానికే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా చల్లగా జారుకున్నాడు. దానితో చిన్న సినిమాలు పొలోమంటూ ముందుకొచ్చేశాయి. జనవరి మొదటి వారంలో ఆర్.ఆర్.ఆర్ కోసం కలలు కంటే.. చివరికి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ వారమైతే అది సాయి కుమార్ అతిధి దేవో భవ అనే సినిమా విడుదలవుతుంది. ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ పోన్ అనగానే.. ఆది గబగబా ఆచార్య దేవోభవని లైన్ లో పెట్టేసాడు. ఆర్.ఆర్.ఆర్ డేట్ ని కొట్టేసాడు.

ఇక రానా నటించిన పాత సినిమా ఒకటి బూజు దులుపుకుని థియేటర్స్ లోకి రాబోతుంది. రానా - రెజినా కలయికలో అప్పుడెప్పుడో తెరకెక్కిన 1945 రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ సినిమా కనీస ప్రమోషన్స్ కి నోచుకోలేదు. ఇక ఆది కిందా మీద పడుతున్నాడు.. అతిధి దేవోభవని ప్రమోట్ చేసి రిలీజ్ చెయ్యడానికి. కానీ ప్రేక్షకులే ఈ రెండు సినిమాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. చిన్న సినిమాలు, ఇంట్రెస్ట్ లేని సినిమాలతో జనవరి మొదటి వారానికి బోణి కొడుతున్నారు ప్రేక్షకులు. నిజంగానే ఈ వారం బాక్సాఫీసు చాలా నీరసంగా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలతో 2022 మొదటి వారమే బోర్ కొట్టిస్తున్నారు.

Rana Vs Aadi Sai Kumar:

Aadi Sai Kumar Athidi Devo Bhava vs Rana 1945

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ