అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఐదు భాషల్లో రిలీజ్ అయిన 21 రోజుకే ఓటిటిలో వచ్చేస్తుండడంతో.. అల్లు అర్జున్ ఫాన్స్ బాగా ఫీలవుతున్నారు. ఇంకా థియేటర్స్ కలెక్షన్స్ తెస్తున్న సినిమాని అప్పుడే ఓటిటి ఇచ్చెయ్యడం ఏమిటో అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఓ పక్క కరోనా కేసులు పెరుగుదల, మరోపక్క నైట్ కర్ఫ్యూలతో థియేటర్స్ లో కలెక్షన్స్ తగ్గాయి.. అలాగే పుష్ప ని ఎర్లీ రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ కోట్ చేసిన డీల్ భారీగా ఉండడంతో పుష్ప మేకర్స్ పుష్ప ని ఓటిటి రిలీజ్ కి ఒకే చెప్పెయ్యడంతోనే.. సదరు ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్.. పుష్ప ని ఈ నెల 7 వ తేదీన రిలీజ్ కి రంగం సిద్ధం చేసి.. అధికారిక ప్రకటన ఇచ్చేసింది.
అయితే పుష్ప సినిమాకి అమెజాన్ ప్రైమ్ దాదాపుగా 27 నుండి 30 కోట్ల తో డీల్ క్లోజ్ చేసింది అని, అందుకే పుష్ప ని ఎర్లీ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఒప్పేసుకున్నారట. మరి థియేటర్స్ లో ఇంకా రన్ అవుతున్నా.. రోజుకి లక్షల్లో కూడా కలెక్షన్స్ కూడా రావడం లేదు.. ఇదే సరైన టైం.. పుష్ప ని ఓటిటి లో రిలీజ్ చేసేందుకు అంటూ మేకర్స్.. అమెజాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రేపటి నుండి అంటే శుక్రవారం నుండి పుష్ప అమెజాన్ నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.