Advertisementt

పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టేది ఎప్పుడంటే..

Thu 06th Jan 2022 01:27 PM
pushpa 2,pushpa the rule,allu arjun,sukumar,rashmika,devisri prasad,fahad fasil,sankranthi  పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టేది ఎప్పుడంటే..
Pushpa 2 Shooting Update పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టేది ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

పుష్ప ది రైజ్ ని ఏదో హడావిడిగా రిలీజ్ చేసి.. కూల్ గా కూర్చుంది పుష్ప టీం. డేట్ ఇచ్చాం తగ్గితే బాగోదు.. తగ్గేదేలే అంటూ హడావిడి ప్రమోషన్స్ తో అల్లు అర్జున్ పుష్ప మూవీ ని గత ఏడాది చివరిలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేసారు. సుకుమార్ రాత్రి పగలు కష్టపడి షూటింగ్ చెయ్యడం, పోస్ట్ ప్రొడక్షన్స్ అంటూ తిరగడంతో అనుకున్న టైం కి పుష్ప థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పుష్ప ద రైజ్ జర్నీ ముగిసింది. రేపటితో థియేటర్స్ నుండి పుష్ప ఓటిటికి ఎక్కేస్తుంది. అమెజాన్ ప్రైమ్ నుండి పుష్ప ది రైజ్ రేపు రిలీజ్ అవుతుంది.

ఇక పుష్ప 2 పుష్ప ధీ రూల్ మూవీ ఈ ఏడాది నవంబర్ కానీ, డిసెంబర్ లో కానీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా సుకుమార్ పుష్ప ప్రమోషన్స్ అప్పుడే చెప్పారు. అయితే పుష్ప సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది సంక్రాంతి తర్వాత పుష్ప 2 షూట్ పూర్తి చేసి.. మిగతా టైం అంతా పోస్ట్ ప్రొడక్షన్, అలాగే ప్రమోషన్స్ కి వాడి సినిమాని ఈసారి కూల్ గా పాన్ ఇండియాలో రిలీజ్ చెయ్యాలని అల్లు అర్జున్ చూస్తున్నారు. అందుకే పండగ తర్వాత వెంటనే.. పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టే ఏర్పాట్లలో టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Pushpa 2 Shooting Update :

Pushpa 2 Work Begins After Sankranthi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ