ఏపీ ప్రభుత్వం తగ్గించిన టికెట్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీ లోనువారు కలిసి కట్టుగా కాకుండా ఎవరికి వారే సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న చిరు ఈ టికెట్ రేట్స్ తో సినిమాలు విడుదల చెయ్యడం కష్టమంటే.. మోహన్ బాబు అందరూ కలిస్తేనే ఈ విషయం తెగుతుంది అంటూ లేఖ రాసారు. ఇక ఆర్జీవీ మాత్రం ఏపీ మంత్రి పేర్ని నాని తో ట్వీట్స్ ఫైట్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తగ్గించిన ధరలతో వర్కౌట్ అవ్వదని తెగేసి చెబుతున్నారు.. కానీ ఇప్పుడు అక్కినేని నాగార్జున మాత్రం ఏపీ టికెట్ రేట్స్ విషయంలో నాకెలాంటి ఇష్యు లేదు.. నా సినిమా జనవరి 14 న విడుదల అంటూ మట్లాడడం చూస్తుంటే.. నాగార్జున ఏపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఎందుకు అని.. కంప్రమైజ్ అయ్యారా అంటూ నెటిజెన్స్ గోల చేస్తున్నారు.
రీసెంట్ గా హైదరాబాద్ లో నాగార్జున నటించిన బంగార్రాజు ప్రెస్ మీట్ లో నాగార్జున ని సదరు జర్నలిస్ట్ లు.. ఏపీలో ప్రస్తుతం టికెట్ రేట్స్ ఇష్యు నడుస్తుంది. మరి మీరు సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ రావు కదా అని అడగగా.. దానికి నాగార్జున ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లాంటి సినిమాలు పాన్ ఇండియా సినిమాలు. అవి రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఆ విషయం చాలా బాధాకరం, పెద్ద సినిమాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అవి రిలీజ్ కాకపోవడమే మంచిది. అలాగే టికెట్ రేట్స్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ధర తక్కువుంటే తమకు తక్కువ డబ్బులొస్తాయి అంతేనని నాగార్జున చాలా క్యాజువల్ గా మట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ప్రస్తుతం సినిమాలు విడుదలకు అనుకూలంగా లేకపోయినా.. సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేమని, అందుకే డబ్బులు తక్కువ వస్తున్నాయని తెలిసినా.. రిలీజ్ చేస్తున్నామని నాగార్జున చెప్పారు. మరి నాగార్జున గత నెలలో ఏపీ సీఎం జగన్ తో కలిసి లంచ్ కూడా చేసారు. మరి టికెట్ రేట్స్ తగ్గించుప్పుడు అదే చనువుతో ఆయనతో మీటింగ్ పెట్టొచ్చు. కానీ పెట్టలేదు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు.. అంటే నాగ్ ఖచ్చితంగా కాంప్రమైజ్ అయినట్లే కనబడుతుంది వ్యవహారం.