టాలీవుడ్ లో యంగ్ హీరోల అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా వుండే అనుపమ పరమేశ్వరన్.. ఈమధ్యన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. ఒకప్పుడు హోమ్లీ గా, చాలా ట్రెడిషనల్ గా, సినిమాల్లో సారీస్ తోనూ, చుడి దార్లు తోనూ కనబడిన అనుపమ.. రీసెంట్ గా మోడరన్ అవతారమెత్తింది. గ్లామర్ గా ఫోజులిస్తూ యూత్ ని కవ్విస్తుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ క్రికెటర్ బుమ్రా తో లవ్ ఎఫ్ఫైర్ నడిపించింది అనే న్యూస్ ఉన్నా.. బుమ్రా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆతర్వాత అనుపమ లవ్ న్యూస్ లు ఏవి సోషల్ మీడియాలో వినిపించలేదు.
కానీ రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్.. ఫాన్స్ చిట్ చాట్ లో తన ప్రేమ వ్యవహారం గురించి మట్లాడడమే కాకుండా.. బ్రేకప్ అయ్యింది అంటూ చెప్పి షాకిచ్చింది. సోషల్ మీడియా లైవ్ లో నెటిజెన్స్ ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఆమెని బ్రేకప్ విషయం అడగగా.. నేను ప్రేమలో ఫెయిల్ అయ్యాను అంటూ తన బ్రేకప్ గురించి చెప్పింది. అయితే ఎవరితో లవ్ లో పడి బ్రేకప్ చేసుకుందో అనే విషయాన్ని మాత్రం అనుపమ రివీల్ చెయ్యలేదు. దీనితో క్రికెటర్ బుమ్రానే.. అనుపమ లవర్ అని, అతనితోనే ఆమెకి బ్రేకప్ అయ్యింది అని ఫిక్సయిపోతున్నారు.