సీరియల్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం ఫేమ్ సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లి విపరీతంగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ కి ఎంటర్ అయ్యే ముందే సిరి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆ విషయం మరచి హౌస్ లో తన ఫ్రెండ్ షణ్ముఖ్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్లుగా పదే పదే చెప్పింది. సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసరికి ఆమెకి క్రేజ్ వచ్చిందో.. లేదో.. కానీ డ్యామేజ్ మాత్రం బాగా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ తో హగ్గులు, ముద్దుల విషయంలో ట్రోల్స్ ని, నెగెటివిటీని సిరి ఫేస్ చేసింది. ఇక సిరి బాయ్ ఫ్రెండ్ సిరితో ఉన్న బంధాన్ని తెంచుకుంటాడనే న్యూస్ ప్రచారంలో ఉంది.
అయితే ఇప్పుడు తాజాగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కి బిగ్ బాస్ సీజన్ 6 నుండి భారీ ఆఫర్ వచ్చింది అని, త్వరలోనే ఓటిటిలో మొదలు కాబోతున్న బిగ్ బాస్ 6 కి ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ ఎంపికవగా.. అందులో క్రేజీగా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ పేరు ఉంది అని అంటున్నారు. అయితే శ్రీహన్ ఇంకా బిగ్ బాస్ డీల్ కి ఓకె చెప్పలేదని, త్వరలోనే డెసిషన్ తీసుకుంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం సిరి లవర్ గా శ్రీహన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. కారణం సిరి కి శ్రీహన్ కి బ్రేకప్ జరగబోతుంది అనే విషయం. అదే పాపులారిటీతో అతన్ని హౌస్ లోకి తీసుకువస్తే పనికొస్తుంది.. బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుందట.