Advertisementt

కథ నచ్ఛలేదు, కానీ సినిమా నచ్చింది

Wed 05th Jan 2022 01:38 PM
icon star allu arjun,pushpa,super star mahesh babu,tweets,sukumar,devisri prasad,mythri movie makers  కథ నచ్ఛలేదు, కానీ సినిమా నచ్చింది
Mahesh Babu in awe with Allu Arjun stellar act కథ నచ్ఛలేదు, కానీ సినిమా నచ్చింది
Advertisement
Ads by CJ

రంగస్థలం తర్వాత దర్శకుడు సుకుమార్ మహేష్ బాబు హీరోగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేసథ్యంలో కథ రాసుకుని మహేష్ ని ఒప్పించడానికి ట్రై చేసారు. మహేష్ కూడా ఆల్మోస్ట్ ఒప్పుకుని.. చివరికి టెక్నీకల్ ఇష్యుస్ వలన సినిమా చెయ్యడం లేదనేశారు. దానితో ఆ కథ అటు మార్చి ఇటు మార్చి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లడం పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో మొదలయ్యింది.. ఇక అడవుల వెంట ఎంతో శ్రమటోర్చి పుష్ప షూటింగ్ కంప్లీట్ చేసి.. గత ఏడాది డిసెంబర్ 17 న పుష్పని ఐదు భాషల్లో రిలీజ్ చేసారు. పుష్ప సినిమాకి మిక్స్డ్ టాక్ పడినా.. అల్లు అర్జున్ క్రేజ్ తో ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే పుష్ప సినిమాని తాజాగా సూపర్ స్టార్ మహేష్ వీక్షించారు.

మహేష్ పుష్ప సినిమాపై ట్వీట్ చేస్తూ.. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ సూపర్ అని, సెన్సేషనల్ అండ్ ఒరిజినల్ అంటూ చెప్పిన మహేష్, దర్శకుడు సుకుమార్ గురించి చెప్తూ.. రా, రిస్టిక్, బ్రూటల్లీ హొనెస్ట్ అని మళ్ళీ నిరూపించారు అని అన్నారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి మహేష్ ప్రత్యేకంగా అభినందించడం అల్లు అర్జున్ ఫాన్స్ కి బాగా నచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది.. అంటూ మహేష్ ట్వీట్ చేసారు.

దానికి బదులుగా అల్లు అర్జున్ కూడా థ్యాంక్యూ సో మచ్‌ మహేశ్‌. పుష్ప సినిమా నచ్చడం నాకెంతో ఆనందంగా ఉంది. పుష్పని తెరకెక్కించడం కోసం యూనిట్ లోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డాం. మీ ప్రశంసలు మా అందరికీ  ఆనందాన్ని ఇచ్చాయి. అంటూ రిప్లై ఇవ్వగా.. కథ నచ్ఛలేదు కానీ.. సినిమా నచ్చిందా మహేశు అంటూ నెటిజెన్స్ మహేశ్ కి కౌంటర్ వేస్తున్నారు.

Mahesh Babu in awe with Allu Arjun stellar act:

Icon Star Allu Arjun Pushpa stuns Super Star Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ