అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా స్టయిల్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ గత ఏడాది డిసెంబర్ లో ఐదు భాషల్లో రిలీజ్ అయ్యి సత్తా చాటింది. ప్రమోషన్స్ లో వీక్ ఉన్నప్పటికీ.. హిందీలో అల్లు అర్జున్ పుష్ప రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పుష్ప రేంజ్ ఏమిటో చూపించింది. రష్మిక హీరోయిన్ గా.. మలయాళ మనటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించిన పుష్ప సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్, ప్రమోషన్స్ అంటూ చాలా హడావిడి చేస్తే కానీ.. డిసెంబర్ 17 న పుష్ప సక్రమంగా రిలీజ్ అవ్వలేదు.
పుష్ప పార్ట్ వన్ కి రమారమి ఓ 180 కోట్లు ఖర్చు పెట్టారు మేకర్స్. అయితే అందులో ఎడిటింగ్ లో పోయిన సీన్స్ ఖర్చే ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఫారెస్ట్ లో.. వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ ల మధ్యన తెరకెక్కించిన కొన్ని సీన్స్, అలాగే ఓ యాక్షన్ సీన్ ఎడిటింగ్ లో లేపేసారని, ఆ ఎడిటింగ్ లో పోయిన సీన్స్ ఖర్చు దాదాపుగా 12 కోట్లు అంటున్నారు. పార్ట్1 నుండి పార్ట్2 లో కొన్ని సీన్స్ యాడ్ చెయ్యొచ్చు అనుకున్న సీన్స్ కూడా.. పుష్ప కి వచ్చిన విమర్శలతో వాటిని పక్కనపడేశారట. అయితే పుష్ప నుండి ఎడిటింగ్ లో లేపేసిన సీన్స్ ని కొన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి హడివి లేకుండా కూల్ గా సినిమా షూట్ చేసి ఉంటే.. ఇంత మనీ వేస్ట్ అయ్యేది కాదు అని అంటున్నారు.
మరి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇంత వేస్ట్ అయినా నిర్మాతలకు కనబడదు. లేదంటే పుష్ప కొచ్చిన టాక్ తో కలెక్షన్స్ రాకపోయి ఉంటే.. నిర్మాత ఘొల్లుమనేవారు.