నాగ శౌర్య చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలుంటాయి. రోజూ ఎదో ఒక సినిమా కి షూటింగ్ చేస్తూ ఉంటాడు. అన్ని సినిమాలు ఎక్కువగా కొత్త దర్శకులతో చేస్తూ ఉంటాడు. అన్నీ అద్భుతమయిన సినిమాలని అంటూ ఉంటాడు కానీ ఈమధ్య నాగ శౌర్య అంచనా గాడి తప్పుతోంది. అయిదేళ్ల క్రితం రిలీజ్ అయిన చలో తరువాత నాగ శౌర్యకి సరయిన హిట్ రాలేదు. ఓ బేబీ అన్న సినిమాలో శౌర్య కూడా వున్నాడు కానీ ఆ సినిమా సక్సెస్ సమంత అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. అందుకని శౌర్యకి చలో తరువాత హిట్ లేనే లేదు. ఈమధ్య ఏవేవో రిలీజ్ అవుతున్నాయి, అన్నీ అలాగే వెళ్లిపోతున్నాయి. కానీ ఏది శౌర్య కెరీర్ కి పనికొచ్చేది లేదు. అన్నీ మూడు నాలుగు రోజులు మాత్రమే ఆడుతున్నాయి.
అయితే శౌర్య తల్లిదండ్రులు కేవలం శౌర్య ని అడ్డం పెట్టుకొని అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవటం తప్ప, స్టోరీ సరిగ్గా వినటం లేదు అని ఒక చిన్న రూమర్. సినిమా ఫెయిల్ అయితే వాళ్ళు దర్శకుడు మీదకి నెట్టేయటం కూడా పరిపాటి అయిపొయింది. శౌర్య మన తెలుగు ఇండస్ట్రీ లో వున్న కొద్దిమంది పెర్ఫార్మ్ చెయ్యగల నటుల్లో ఒకడు. అటువంటి శౌర్య ఒక సినిమా తరువాత ఇంకో సినిమా చేసేటట్టు ఫోకస్ చేస్తే మంచిది. లేకపోతే ఈ సినిమా కూడా సరిగ్గా ఆడక, మొత్తం కెరీర్ దెబ్బతినే అవకాశం వుంది. ఈ మధ్య రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి, అందులో ఒక సినిమాకి హిట్ టాక్ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఇలాగె కొనసాగితే, శౌర్యాని కూడా ఎవరు పట్టించుకోరు.