ప్రతి విషయాన్ని అడ్డంగా వాదించే రామ్ గోపాల్ వర్మ మొదటిసారి ఇండస్ట్రీకి పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో అయినా మధ్యలో దూరిపోయి కంపు కంపు చేసే ఆర్జీవీ.. ఫస్ట్ టైం ఆంధ్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్స్ తగ్గించి సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఫలితం సూన్యం.. ఇక తాజాగా ఆర్జీవీ రంగంలోకి దిగడమే ఏపీ మంత్రులకి చమటలు పట్టిస్తున్నారు. వరస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాను వేసిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని మంత్రి పేర్ని నాని ని సూటిగానే ఢీ కొట్టారు.
పేదవాళ్లకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం అని చెబుతున్నారు. మరి సినిమా వాళ్ళకి కూడా విద్య, వైద్య రంగానికి ఇచ్చినట్టుగా రాయితీలు ఇవ్వొచ్చు కదా.
లేని వాళ్ళకి పంచదార, బియ్యం అందించడానికి రేషన్ షాప్స్ ఉన్నట్టుగా.. రేషన్ థియేటర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించాలి.
అసలు సినిమా టికెట్స్ ని ప్రభుత్వమే నిర్ణయించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి..
సినిమా అనే కాదు, దేనిని తయారు చేసినా.. దానిలో మర్కెట్ ధరను నిర్ణయించడానికి ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంటుంది.. అంటూ తన ప్రశ్నలకి పేర్ని నాని సమాధానాలు చెప్పాలంటూ ఆర్జీవీ డిమాండ్ చేసారు.