ఉత్తరాంధ్రలోని ఏ టెంపుల్ లో ఎటువంటి నియామకం జరగాలన్నా ఆ స్వామిజి ని తప్పనిసరిగా అడిగి చెయ్యాలి. ఆ స్వామిజీ ఎలా చెపితే అలానే నియామకాలు జరగాలి, తప్పితే అధికారులు అక్కడ రూల్స్ మాట్లాడకూడదు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ స్వామిజీ మీకందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ఆంధ్ర సి ఎం మరియు తెలంగాణ సి ఎం కూడా ఆ స్వామిజీకి సాష్టాంగ పెద్దవాళ్ళే కదా. ఆ స్వామిజీ మరి మన విశాఖపట్నం లో ఆరిలోవ లో తన పీఠాన్ని పెట్టుకొని ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ నుండి పరిపాలన సాగిస్తున్నారని అంటారు.
అందుకే ఆ స్వామిజీ కి అందరూ పెట్టిన పేరు వైజాగ్ సి ఎం అని. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే, వైజాగ్ కి మాత్రం మన స్వామిజీ అంట ముఖ్యమంత్రి. ఇక్కడ ఉత్తరాంధ్ర లో ఎటువంటి నియామకం, రాజకీయ లబ్ది కావాలన్నా, వారు ముందుగా ఈ స్వామిజీ ని దర్శనం చేసుకొని, ప్రసన్నం చేసుకుంటే పని అయిపోయినట్టే అని భావిస్తున్నారు. ఎండోమెంట్ డిపార్టుమెంటు లో పని చేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ అతని కనుసన్నల్లోనే ఉండాలని హుకుం కూడా జారీ చేసారు.